టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌లు.. భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఎక్క‌డ చూడొచ్చో తెలుసా?

అభిమానులంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌లు.. భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఎక్క‌డ చూడొచ్చో తెలుసా?

T20 World Cup warm up matches live streaming Where to watch IND vs BAN in India

T20 World Cup warm up match : ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసింది. ఇప్పుడు అభిమానులంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అమెరికాలో అడుగుపెట్టింది. మెగాటోర్నీకి ముందు భార‌త జ‌ట్టు ఒకే ఒక వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలో కొత్తగా నిర్మించిన మాడ్యులర్ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ వార్మ‌ప్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచులు నేటి (మే 27) ప్రారంభం అయ్యాయి. తొలి స‌న్నాహ‌క మ్యాచ్‌లో కెన‌డా వ‌ర్సెస్ నేపాల్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మొత్తం 20 జ‌ట్ల‌లో 17 జ‌ట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద‌క్కించుకుంది. ప్ర‌ధాన మ్యాచుల‌ను టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో చూడొచ్చు. అదే డిజిట‌ల్‌లో అయితే డిస్నీ+హాట్ స్టార్‌లో వీక్షించ‌వ‌చ్చు. కానీ.. అన్ని వార్మ‌ప్ మ్యాచుల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం లేదు. కేవలం రెండు మ్యాచ్‌లు భార‌త్ వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్, వెస్టిండీస్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా స‌న్నాహ‌క మ్యాచుల‌ను మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.

Also Read: T20 World Cup 2024 : న్యూయార్క్‌లో ల్యాండైన రోహిత్ సేన‌.. వీడియో వైర‌ల్‌

భార‌త్ ఏ గ్రూపులో ఉందంటే..?

ఈ పొట్టి ప్ర‌పంచ‌కప్‌లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. నాలుగు గ్రూపులుగా జ‌ట్ల‌ను విడ‌గొట్టారు. గ్రూపు ఏలో భార‌త్‌తో పాటు పాకిస్థాన్, కెనడా, ఆతిథ్య అమెరికా, ఐర్లాండ్ జ‌ట్లు ఉన్నాయి.

టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే..
భార‌త్ వ‌ర్సెస్ ఐర్లాండ్ – జూన్ 5 రాత్రి 8 గంటలకు ( న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ – జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్ యూఎస్ఏ – జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్ కెనడా – జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్)

Also Read : భార్య‌తో డివోర్స్ రూమర్లు.. విదేశాల్లో సోలోగా హార్దిక్ పాండ్యా విహార‌యాత్ర‌..!