T20 World Cup 2024 : న్యూయార్క్‌లో ల్యాండైన రోహిత్ సేన‌.. వీడియో వైర‌ల్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రం ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు సిద్ద‌మైంది.

T20 World Cup 2024 : న్యూయార్క్‌లో ల్యాండైన రోహిత్ సేన‌.. వీడియో వైర‌ల్‌

Team India players land in New York ahead of the 2024 T20 World Cup

రెండు నెల‌ల పాటు క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించిన ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసింది. ఆదివారం చెపాక్ వేదిక‌గా జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించి క‌ప్పును ముద్దాడింది. ఐపీఎల్ ఇలా ముగిసిందో లేదో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రం ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు సిద్ద‌మైంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇందులో పాల్గొనే దేశాలు ఒక్కొక్క‌టిగా అమెరికా చేరుకుంటున్నాయి. తాజాగా రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు కూడా న్యూయార్క్ లో అడుగుపెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్, సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, రిష‌బ్ పంత్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే త‌దిత‌రులు న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Hardik Pandya : భార్య‌తో డివోర్స్ రూమర్లు.. విదేశాల్లో సోలోగా హార్దిక్ పాండ్యా విహార‌యాత్ర‌..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన భార‌త ఆట‌గాళ్ల‌లో ఐపీఎల్ ఫైన‌ల్ ఆడే వారు మిన‌హా మిగిలిన ఆట‌గాళ్లు శ‌నివారం (మే25న‌) అమెరికా ఫ్లైట్ ఎక్కారు. మిగిలిన వారు ఒక‌టి లేదా రెండు రోజుల్లో న్యూయార్క్‌కు ప‌య‌నం కానున్నారు.

ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైనా టీమ్ఇండియా జ‌ట్టు ఇదే..

రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), య‌శ‌స్వి జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్ (వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్ (వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్‌.

KKR Celebrations : మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్ల సెల‌బ్రెష‌న్స్ చూశారా..?