వినేశ్ ఫోగ‌ట్ అనర్హతపై ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న పోస్ట్..

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.

Anand Mahindra After Vinesh Phogat Disqualified From Paris Olympics

Vinesh Phogat – Anand Mahindra : భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి ఫైన‌ల్‌కు చేరుకుంది వినేశ్‌. ఈ క్ర‌మంలో ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త మ‌హిళా రెజ్ల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. స్వర్ణం లేదా ర‌జ‌తం రెండింటిలో ఏదో ఒక ప‌త‌కంతో దేశానికి వ‌స్తుంద‌ని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా ఆమె పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో యావ‌త్ భార‌త దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

దీనిపై ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర స్పందించారు. ఇది ఓ పీడ‌క‌ల అయితే బాగుండు అని అన్నాడు. ‘వ‌ద్దు.. వ‌ద్దు.. వ‌ద్దు.. ద‌య‌చేసి దీనిని ఓపీడ‌క‌ల‌గా మార్చండి..’ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Also Read : వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు.. మ‌హావీర్ ఫోగ‌ట్ కీల‌క వ్యాఖ్య‌లు..

మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగ‌ట్ పోటీప‌డింది. అయితే మంగ‌ళ‌వారం రాత్రి ఆమె నిర్ణీత బ‌రువు క‌న్నా రెండు కేజీల బ‌రువు పెరిగింది. ఈ క్ర‌మంలో ఆమె బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. బుధ‌వారం ఫైన‌ల్ బౌట్‌కు కొన్ని గంట‌ల ముందు బ‌రువు నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

నిద్ర‌, భోజ‌నం మానేసి, జ‌ట్టు క‌త్తిరించుకుని, సైక్లింగ్‌, స్కిప్పింగ్ వంటి అన్ని చేసిన‌ప్ప‌టికి ఆమె నిర్ణీత బ‌రువు క‌న్నా ఓ 100 గ్రాములు అధికంగా ఉంది. దీంతో ఆమె పై ఒలింపిక్ క‌మిటీ వేటు వేసింది.

Also Read: వినేశ్ ఫోగ‌ట్‌పై అన‌ర్హ‌త వేటు.. బ్రిజ్ భూష‌ణ్ కుమారుడి స్పంద‌న ఇదే..

ట్రెండింగ్ వార్తలు