×
Ad

Anand Mahindra : శీతల్ దేవి ప్రతిభకు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. బంపర్ ఆఫర్.. వీడియో షేర్

పారా ఆసియా క్రీడల్లో ఆమె ఆర్చరీలో పలు విభాగాల్లో భారత్ కు రెండు స్వర్ణాలు, ఒక రజతం పతకం సాధించి పెట్టింది. ఈ యువ క్రీడాకారిణికి రెండు చేతులు లేవు. జమ్మూ కశ్మీర్ కు చెందిన ఆమె..

Anand Mahindra

Archer Sheetal Devi : ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీరోజూ ఏదోఒక ఆసక్తికరమైన పోస్ట్ చేస్తుంటారు. అంతేకాదు.. ప్రతిభ కనబర్చిన పలురంగాల వారికి బహుమతులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు తాజాగా ఆనంద్ మహీంద్ర..  భారతీయ క్రీడాకారిణి స్ఫూర్తికి సంబంధించిన వీడియోను షేర్ చేయడంతోపాటు.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆమె ఎవరోకాదు.. పారా ఆసియా క్రీడల్లో తనదైన ప్రతిభతో సత్తాచాటిన శీతల్ దేవి.

Also Read : IND vs ENG Match: ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం

పారా ఆసియా క్రీడల్లో ఆమె ఆర్చరీలో పలు విభాగాల్లో భారత్ కు రెండు స్వర్ణాలు, ఒక రజతం పతకం సాధించి పెట్టింది. ఈ యువ క్రీడాకారిణికి రెండు చేతులు లేవు. జమ్మూ కశ్మీర్ కు చెందిన ఆమె.. రెండు కాళ్లనే చేతులుగా చేసుకొని ఆర్చరీ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఆ యువ క్రీడాకారిణి స్ఫూర్తి, ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఆమె జీవిత కథనానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.

Also Read : IND vs ENG Match : ఇంగ్లాండ్ తో మ్యాచ్.. 20ఏళ్లుగా టీమిండియాకు దక్కని విజయం.. అశ్విన్ రీఎంట్రీ ఉంటుందా? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే ..

ట్విటర్ లో షేర్ చేసిన పోస్టులో ఆనంద్ మహీంద్రా ఈ విధంగా రాశారు.. నా జీవితంలో చిన్నచిన్న సమస్యల గురించి నేను ఎప్పటికీ ఫిర్యాదు చేయను.. శీతల్ దేవి మీరు మా అందరికీ గురువు.. దయచేసి మా కంపెనీ నుంచి మీకు నచ్చిన ఏదైనా కారును ఎంచుకోండి.. మేము దానిని మీకు అందజేస్తాం. మీకు ఉపయోగపడే విధంగా ఆ వాహనాన్ని తయారు చేసి అందిస్తాం’ అంటూ ఆనంద్ మహీంద్రా తెలిపారు.