సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సూపర్ గిఫ్ట్.. ఎవరు పంపించారో తెలుసా?

టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌ సూపర్ గిఫ్ట్ అందుకున్నారు.

Sarfaraz Khan father: యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. చెస్‌ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద ఫ్యామిలీకి ఇటీవల ఎలక్ట్రిక్ కారును బ‌హుమతిగా ఇచ్చారాయన. తాజాగా టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌కు కూడా గిఫ్ట్ పంపించారు. థార్ కారును కానుకగా ఇచ్చారు. ఆనంద్ మ‌హీంద్రా కానుకగా పంపించిన థార్ కారుతో సర్ఫరాజ్ ఫ్యామిలీ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం చేశాడు. జాతీయ జట్టులో కొడుకు అరంగ్రేటాన్ని స్వయంగా వీక్షించిన నౌషాద్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. తన కుమారుడు కోసం తాను పడిన కష్టాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఫస్ట్ సిరీస్‌లోనే అంచనాలకు తగినట్టుగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు సర్ఫరాజ్. అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా తయారు చేసిన నౌషాద్ ఖాన్‌కు ఆనంద్ మ‌హీంద్రా కారును బహుమతి ఇచ్చారు.

Also Read: ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంపై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్ వైరల్

ధృవ్ జురెల్‌కు ఎప్పుడిస్తారు?
ఆనంద్ మ‌హీంద్రా నుంచి గిఫ్ట్ అందుకున్న సర్ఫరాజ్ ఫ్యామిలీకి నెటిజనులు అభినందలు తెలిపారు. సర్ఫరాజ్‌తో పాటు టెస్టుల్లో అరంగ్రేటం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఆనంద్ మ‌హీంద్రాను కోరుతున్నారు. ధృవ్ జురెల్‌ తండ్రికి ఎప్పుడు గిఫ్ట్ పంపిస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు