ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంపై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్ వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్‌కే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు.

ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడంపై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్ వైరల్

Rohit SHarma and MS Dhoni

MS Dhoni and Rohit sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ పేర్లు వినిపిస్తాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీగా సుదీర్ఘకాలం కొనసాగిన రోహిత్ శర్మ ఐదు సార్లు జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీసైతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్సీగా కొనసాగి ఐదు సార్లు సట్టును ఛాంపియన్ గా మార్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఏడాది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ స్థానంలో రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.

Alos Read : కెప్టెన్ల జాబితాలో ధోని, రోహిత్, కోహ్లీ లేరు.. ఇక ఆనాటి జ్ఞాపకాలే నెమరేసుకోవాలా? మీమ్స్ వెల్లువ

ధోనీ సీఎస్‌కే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్ లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ఐపీఎల్ కెప్టెన్సీలో ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రయాణం అద్భుతంగా కొనసాగిందని చెప్పొచ్చు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ టోర్నీకి కూడా వీడ్కోలు పలికే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ధోనీ ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

Also Read : ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్.. పిక్ వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ఛాంపియన్ గా నిలిపాడు. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఛాంపియన్ గా నిలిచింది.