సీఎం జగన్ వరం: పీవీ సింధుకు 5ఎకరాలు

సీఎం జగన్ వరం: పీవీ సింధుకు 5ఎకరాలు

Updated On : September 14, 2019 / 2:27 AM IST

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం దక్కించుకుని చరిత్ర లిఖించిన పీవీ సింధుకు సత్కారాలతో పాటు ఘనమైన బహుమతులు దక్కుతున్నాయి. శుక్రవారం సెక్రటేరియట్‌లో ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు దాని కోసం 5ఎకరాలు కావాలని ముఖ్యమంత్రిని అడిగారు. 

అడిగిన వెంటనే కాదనకుండా భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారమే తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ, క్రీడాశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, క్రీడా సంఘాల ప్రతినిధి చాముండేశ్వరీనాథ్, శాప్ అధికారుతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను వేర్వేరుగా కలిశారు. వారి నుంచి ఘనమైన సత్కరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతేూ.. సింధు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే గర్వకారణమన్నారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధిస్తాననే నమ్మకముంది. భవిష్యత్తుల్లో క్రీడల్లో మరింతగా రాణించేందుకు సీఎం జగన్ అండగా ఉంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు విశాఖపట్నంలో 5ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు’ అని వెల్లడించారు.