Annu Rani-Kishore Jena: జావెలిన్ త్రోలో భారత్ అదరహో.. అన్ను రాణి, కిశోర్ జెనాకు బంగారు పతకాలు

ఈ పోటీల్లో వెండి పతకం సాధించిన క్రీడాకారిణి లిన్ నాడర్ కేవలం 26.48 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఆమె కన్నా రెండు రెట్ల దూరం అన్ను రాణి విసిరింది.

Kishore Jena - Annu Rani

Annu Rani – Kishore Jena Athletics: లెబనాన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 (Lebanon Athletics Championships 2023)లో భారత అథ్లెట్లు అన్ను రాణి, కిశోర్ జెనా బంగారు పతకాలు సాధించారు. విమెన్స్ జావెలిన్ త్రోలో అన్ను రాణి, మెన్స్ విభాగంలో కిశోర్ జెనా విజేతలుగా నిలిచారు.

లెబనాన్ రాజధాని బీరుట్లో (Beirut) ఈ పోటీలు జరుగుతున్నాయి. Olympics.comలో తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నిర్వహించిన పోటీలో అన్ను రాణి జావెలిన్‌ త్రోలో 55.32 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించింది. గత ఏడాది 63.82 మీటర్లు విసిరి ఆమె జాతీయ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

దానికంటే శుక్రవారం చాలా తక్కువ దూరం విసిరినప్పటికీ ఆమెను కన్నా దూరం మిగతా క్రీడాకారిణులు విసరలేకపోయారు. ఈ పోటీల్లో వెండి పతకం సాధించిన క్రీడాకారిణి లిన్ నాడర్ కేవలం 26.48 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఆమె కన్నా రెండు రెట్ల దూరం అన్ను రాణి విసిరింది.

పురుషుల విభాగంలో జావెలిన్‌ త్రోలో కిశోర్ జెనా 78.96 మీటర్ల దూరం విసిరాడు. గతంలో 82.87 మీటర్ల దూరం విసిరిన చరిత్ర అతడికి ఉంది. అలాగే, టోక్యో 2020 ఒలింపియాన్ శివపాల్ సింగ్ 73.34 మీటర్ల దూరం విసిరి వెండి పతకం సాధించాడు. వారందరినీ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అభినందించింది.

Herchelle Gibbs: ఐసీసీ ప్రపంచ కప్-2023.. తీవ్ర ఒత్తిడిలో టీమిండియా: హెర్చెల్ గిబ్స్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు