Pawan Kalyan : నితీష్ కుమార్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం నితీష్‌రెడ్డిని ప్ర‌శంసించారు.

AP Deputy CM Pawan Kalyan interesting tweet on Nitish Kumar Reddy

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డిన స‌మ‌యంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్‌తో జ‌ట్టును ఆదుకున్నాడు. భార‌త్‌కు ఫాలో ఆన్ గండాన్ని గ‌ట్టెక్కించాడు. ఈ క్ర‌మంలో నితీష్‌రెడ్డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం నితీష్‌రెడ్డిని ప్ర‌శంసించారు.

‘నువ్వు భార‌తదేశంలోని ఏ ప్రాంతం నుంచి వ‌చ్చార‌నేది ముఖ్యం కాదు. దేశం కోసం మీరు ఏం చేశార‌న్న‌దే ముఖ్యం. దేశం గ‌ర్వించేటి ప్ర‌ద‌ర్శ‌న చేసినందుకు అభినంద‌న‌లు. ఐకానిక్ మెల్‌బోర్న్ స్టేడియంలో ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడావు. నువ్వు మ‌రెన్నో ప్ర‌పంచ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాలి. యువతకు క్రీడల పట్ల అభిరుచి, దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలి.’ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమ్ఇండియా విజ‌యం సాధించాల‌ని ప‌వ‌న్ ఆకాంక్షించారు.

IND vs AUS 4th test : మూడు క్యాచులు మిస్ చేసిన య‌శ‌స్వి జైస్వాల్‌.. రోహిత్ శ‌ర్మ తీరు పై విమ‌ర్శ‌లు..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 ప‌రుగులు చేసింది. అనంత‌రం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు కీల‌క‌మైన 105 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జ‌ట్టు నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 9 వికెట్ల న‌ష్టానికి 228 ప‌రుగులు చేసింది. స్కాట్ బొలాండ్ (10), నాథ‌న్ లైయాన్ (41) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆసీస్ 333 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

IND vs AUS 4Th test : ప‌ట్టుబిగించిన ఆస్ట్రేలియా.. 333 ప‌రుగుల ఆధిక్యంలో.. ఆఖ‌రి వికెట్ కోసం భార‌త్ తంటాలు..