IND vs AUS 4Th test : పట్టుబిగించిన ఆస్ట్రేలియా.. 333 పరుగుల ఆధిక్యంలో.. ఆఖరి వికెట్ కోసం భారత్ తంటాలు..
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది.

IND vs AUS 4Th test Day 4 Stumps Australia lead by 333 runs
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. స్కాట్ బొలాండ్ (10), నాథన్ లైయన్ (41) లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరు అభేధ్యమైన పదో వికెట్ కు 110 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తంటాలు పడుతున్నారు.
ఆసీస్ బ్యాటర్లలో బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. పాట్ కమిన్స్ 41 పరుగుతో రాణించాడు. ఉస్మాన్ ఖవాజా 21 పరుగులతో పర్వాలేదనిపించగా స్టీవ్ స్మిత్ (13), ట్రావిస్ హెడ్ (1), మిచెల్ మార్ష్ (0), అలెక్స్ కేరీ (2) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఓ వికెట్ సాధించాడు.
IND vs AUS : ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 358/9 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 11 పరుగులు జోడించి మిగిలిన ఒక్క వికెట్ కోల్పోయింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పోతున్నా మరోవైపు లబుషేన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడికి కెప్టెన్స్ కమిన్స్ చక్కని సహకారం అందించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.
లబుషేన్ ఔట్ అనంతరం స్వల్ప విరామంలో మిచెల్ స్టార్ట్క్ (5) పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక అర్థశతకానికి కొద్ది దూరంలో కమిన్స్ జట్టు స్కోరు 173 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే.. బొలాండ్, నాథన్ లైయాన్ జోడి భారత బౌలర్లు ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధిస్తూ మరో వికెట్ పడకుండా రోజును ముగించింది.
Koneru Humpy : ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా కోనేరు హంపీ
That’s Stumps on Day 4
Australia reach 228/9 and lead by 333 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/Gw8NbCljL7
— BCCI (@BCCI) December 29, 2024