IND vs AUS : ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..
ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది.

IND vs AUS Josh Inglis ruled out of fifth Test due to injury
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ ఇంగ్లిష్ గాయపడ్డాడు. దీంతో అతడు చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలియజేసింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి, ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నాలుగో టెస్టు మ్యాచ్ తుది జట్టులో ఇంగ్లిస్‌కు చోటు దక్కలేదు. అయినప్పటికి సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఫీల్డింగ్ చేశాడు. రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టలేదు. అతడు కాలిమడమల నొప్పితో బాధపడుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైద్యులు అతడి గాయానికి స్కానింగ్ నిర్వహించగా కాలి మడమ కండరాల్లో వాపు కనిపించిందని దీంతో అతడు ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యాడని చెప్పింది.
Koneru Humpy : ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా కోనేరు హంపీ
భారత్‌తో సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. ముందు జాగ్రత్తగానే భారత్‌తో ఐదో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే శ్రీలంకతో టెస్టు సిరీస్ కూడా ఆసీస్‌కు కీలకం అన్న సంగతి తెలిసిందే.
ఇక మెల్‌బోర్న్ టెస్టు విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాథన్ లైయాన్ (29), స్కాట్ బొలాండ్ (10) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 319 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Jasprit Bumrah : మాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు అరవండి బాబులూ.. బుమ్రా సంబురాలు వైరల్