Koneru Humpy : ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా కోనేరు హంపీ
తెలుగు తేజం కోనేరు హంపి మరో ఘనత సాధించింది

Koneru Humpy grabs historic World Rapid Chess Championship title second time
తెలుగు తేజం కోనేరు హంపి మరో ఘనత సాధించింది. చెస్‌లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2019లోనూ హంపి ఈ టోర్నీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనతను సాధించింది.
అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకుందర్‌ను ఓడించి హంపీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 8.5 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్స్ చేరుకున్న హంపి 11వ రౌండ్‌లో ఐరీన్ సుకుందర్ ఓడించింది. మొత్తం ఆరు మంది జు వెన్ఝుమ్, కేథరినా లాగ్నో, ద్రోణవల్లి హారిక, అఫ్రుజ్ ఖమ్దమోవ, టాన్ ఝొంగ్యి లు ఈ టైటిల్ కోసం పోటీ పడ్డారు. ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.
Jasprit Bumrah : మాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు అరవండి బాబులూ.. బుమ్రా సంబురాలు వైరల్
ఈ రోజు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నట్లు హంపి చెప్పింది. వాస్తవానికి గేమ్ టై బ్రేక్ కు దారి తీస్తుందని తాను భావించానని తెలిపింది. అయితే విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇది నాకు ఉద్విగ్నమైన క్షణం, అని తన విజయం తరువాత హంపి తెలిపింది.
ఇక పురుషుల విభాగానికి వస్తే.. రష్యాకు చెందిన వొలొదర్ అర్టురోవిచ్ ముర్జిన్ విజేతగా నిలిచాడు. 18 ఏళ్ల వయసులోనే ఈ టైటిల్‌ను అందుకున్న రెండో గ్రాండ్ మాస్టర్ అతడే. గతంలో నొబిర్‌బెక్ అబ్డుసట్టొరొవ్ 17 ఏళ్ల వయసులో ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను నెగ్గాడు. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఆఖర్లో వెనుకబడి పోయాడు.
👏 Congratulations to 🇮🇳 Humpy Koneru, the 2024 FIDE Women’s World Rapid Champion! 🏆#RapidBlitz #WomenInChess pic.twitter.com/CCg3nrtZAV
— International Chess Federation (@FIDE_chess) December 28, 2024