Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ పై ఒకే ఒక్క‌డు

Arshdeep Singh creats history : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Arshdeep Singh creats history

టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ద‌క్షిణాప్రికా గ‌డ్డ పై ఐదు వికెట్లు తీసిన మొద‌టి భార‌త పేస‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో అత‌డు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచులో త‌న కోటా 10 ఓవ‌ర్ల‌ను వేసిన అర్ష్‌దీప్ సింగ్ 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా మూడో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

అర్ష్‌దీప్ కంటే ముందు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారంతా స్పిన్న‌ర్లే కావ‌డం గ‌మ‌నార్హాం. మొట్ట‌మొద‌టి సారి ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ పై ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను స్పిన్న‌ర్ సునీల్ జోషి (5/6) సాధించాడు. 1999లో అత‌డు స‌ఫారీల‌పైనే దీన్ని అందుకున్నాడు. ఆ త‌రువాత 2018లో సెంచూరియన్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో స్పిన్న‌ర్ చాహల్ (5/22) ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. తాజాగా అర్ష్‌దీప్ సింగ్ మొద‌టి పేస‌ర్‌గా నిలిచాడు.


ఒత్తిడికి లోనైయ్యా..

మ్యాచ్ ఆరంభంలో తాను కాస్త ఒత్తిడికి లోనైన‌ట్లు అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ కంటే ముందు అర్ష్‌దీప్ మూడు వ‌న్డేలు ఆడిన‌ప్ప‌టికీ ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేదు. ఇదే విష‌యాన్ని అత‌డు చెప్పాడు. అయితే.. నాలుగో మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లతో రాణించ‌డం ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. దేవుడికి, టీమ్ మేనేజ్మెంట్‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

Also Read: ఇషాన్ కిష‌న్‌కు షాక్‌.. ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి త‌ప్పించిన‌ బీసీసీఐ.. ఎందుకంటే..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా 27.3 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో ఫెహ్లుక్వాయో (33), టోనీ డి జోర్జి (28) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో స్వ‌ల్ప స్కోరుకే ద‌క్షిణాఫ్రికా ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల‌తో స‌ఫారీల‌ ప‌త‌నాన్ని శాసించ‌గా అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కుల్దీప్ యాద‌వ్ ఓ వికెట్ తీశాడు.

Also Read : నాథ‌న్ లియోన్ అరుదైన ఘ‌న‌త‌.. 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు.. అశ్విన్‌కు క‌ష్ట‌మేనా..!

అనంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), అరంగ్రేట బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ 16.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు