IND vs ENG : ఓరి నాయ‌నో ఇదేం ట్విస్ట్.. అర్ష్‌దీప్ సింగ్‌కు నో ప్లేస్‌.. ఆ రికార్డు కోసం ఈ పేస‌ర్‌ ఇంకెన్నాళ్లు ఆగాలో తెలుసా?

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100వ వికెట్ కోసం అర్ష్‌దీప్ సింగ్ ఇంకెన్నాళ్లు ఆగాలంటే..

Arshdeep Singh will be wait nearly six months for his 100th wicket in T20s

టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త సాధించేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించేందుకు మ‌రికొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు అర్ష్‌దీప్ సింగ్ 63 టీ20 మ్యాచుల్లో 99 వికెట్లు తీశాడు. మ‌రొక్క వికెట్ తీస్తే అత‌డు వంద వికెట్ల క్ల‌బ్‌లో చేరుతాడు. అంతేకాకుండా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వేగంగా 100 వికెట్లు తీసిన పేస‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. ఈ క్ర‌మంలో అత‌డు పాకిస్థాన్ పేస‌ర్ హారిస్ రౌఫ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్నాడు. పాకిస్థాన్ పేస‌ర్ హారిస్ రౌఫ్ 71 టీ20 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీశాడు.

వాస్త‌వానికి అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లాండ్‌తో నేడు (ఫిబ్ర‌వరి 2న‌) జ‌రుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లోనే ఈ ఘ‌న‌త సాధిస్తాడ‌ని అంతా అనుకున్నారు. అయితే.. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ పెద్ద షాకిచ్చాడు. తుది జ‌ట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు స్థానం ద‌క్క‌లేదు. వ‌న్డే సిరీస్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ నేప‌థ్యంలో అత‌డికి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు సూర్య చెప్పాడు. అత‌డి స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీని తీసుకున్నాడు. దీంతో వంద వికెట్ల క్ల‌బ్‌లో చేరేందుకు అర్ష్‌దీప్ మ‌రికొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు.

Virat Kohli : రంజీ మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌల‌ర్‌.. ఆటోగ్రాఫ్ కోసం వ‌స్తే.. కోహ్లీ ఏమ‌న్నాడంటే..

టీమ్ఇండియా త‌న త‌దుప‌రి టీ20 మ్యాచ్‌ను ఎప్పుడు ఆడుతుంద‌టే..?

ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్ త‌రువాత భార‌త జ‌ట్టు ఇంగ్లీష్ టీమ్‌తోనే వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డేల సిరీస్ ఫిబ్ర‌వ‌రి 6న ప్రారంభం కానుంది. ఆ త‌రువాత భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆడ‌నుంది. పిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ త‌రువాత టీమ్ఇండియా ఆట‌గాళ్లు మార్చి 14 నుంచి మే 25 వ‌ర‌కు ఐపీఎల్‌తో బిజీ అవుతారు.

ఐపీఎల్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు జూన్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిఫ్ (డ‌బ్ల్యూటీసీ) నాలుగో సైకిల్ ఈ సిరీస్ నుంచే ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఐదు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. తొలి టెస్టు జూన్ 20 ప్రారంభం కానుంది. ఇక ఆఖ‌రి టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగ‌స్ట్ 4 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న పూర్తి అయిన త‌రువాత భార‌త జ‌ట్టు ఆగ‌స్టులో బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. కాగా.. ఈసిరీస్‌ల‌కు సంబంధించిన తేదీలు ఇంకా ఖ‌రారు కాలేదు.

Under 19 Women’s T20 World Cup : మ‌హిళ‌ల అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా? భార‌త్ నుంచి ఎంత మంది అంటే?

నేటి మ్యాచ్ త‌రువాత భార‌త జ‌ట్టు మ‌ళ్లీ ఆగ‌స్టులో బంగ్లాదేశ్‌తోనే టీ20 సిరీస్ ఆడ‌నుంది. అంటే ఆరు నెల‌ల త‌రువాతనే అర్ష్‌దీప్ సింగ్ టీ20లు ఆడే అవ‌కాశం ఉంది. దీంతో వందో వికెట్ కోసం అర్ష్‌దీప్ సింగ్ అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

అంత‌ర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌల‌ర్లు..

రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్‌) – 53 మ్యాచ్‌లు (అక్టోబర్ 2021లో పాకిస్థాన్‌పై)
సందీప్ లామిచానే (నేపాల్‌) – 54 మ్యాచ్‌లు (జూన్ 2024లో బంగ్లాదేశ్‌పై)
వనిందు హసరంగా (శ్రీలంక‌) – 63 మ్యాచ్‌లు (ఫిబ్రవరి 2024లో అఫ్గానిస్థాన్ పై)
హారిస్ రౌఫ్ (పాకిస్థాన్‌) – 71 మ్యాచ్‌లు (జూన్ 2024లో కెనడాపై)
ఎహ్సాన్ ఖాన్ (హాంకాంగ్‌) – 71 మ్యాచ్‌లు (ఆగస్టు 2024లో మలేషియాపై)