Virat Kohli : రంజీ మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌలర్.. ఆటోగ్రాఫ్ కోసం వస్తే.. కోహ్లీ ఏమన్నాడంటే..
రంజీ మ్యాచ్‌లో తనను ఔట్ చేసిన బౌలర్ ఆటోగ్రాఫ్ కోసం వస్తే కోహ్లీ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

What Virat Kohli Said When Himanshu Sangwan Reached Out For Autograph
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తరువాత రంజీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీకి కోహ్లీ ప్రాతినిథ్యం వహించాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో కోహ్లీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో మరోసారి కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
కాగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన హిమాన్షు సాంగ్వాన్ పై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడినే ఔట్ చేస్తావా అంటూ విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ వద్దకు హిమాన్షు సాంగ్వాన్ వెళ్లాడు.
Virat Kohli giving his autograph to Himanshu Sangwan on the ball which wicket his took. [Lokesh Sharma]
– A beautiful gesture by Kohli 👏 pic.twitter.com/c716HqZEPX
— Johns. (@CricCrazyJohns) February 2, 2025
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అతడిని ప్రశంసించాడు. తనను ఔట్ చేసిన సంగతి గుర్తు చేస్తూ అద్భుతమైన బంతిని విసిరావని అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాదండోయ్ బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా హిమాన్షు సాంగ్వాన్ వెల్లడించాడు.
‘మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ వద్దకు నేను వెళ్లాను. బంతిపై అతడి ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాను. అప్పడు కోహ్లీ నాతో మాట్లాడుతూ.. నువ్వు అద్భుతమైన బంతిని విసిరావు అని అన్నాడు. ఆ బంతిని అతడు ఆస్వాదించినట్లు చెప్పాడు.’ అని సాంగ్వాన్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రైల్వేస్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్లు తొలి ఇన్నింగ్స్‌లో 106.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ విపలం అయినా సుమిత్ మాథుర్ (86) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రైల్వేస్ 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. సుమిత్ మాథుర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది.