Champions Trophy 2025 : పాకిస్తాన్‌కి దబిడి దిబిడే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు వీళ్లే అంటున్న పాంటింగ్..
పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లు ఏవి అనే విషయాన్ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.

పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం ఈ టోర్నీ పై పడింది. 2017లో చివరి సారిగా జరిగిన టోర్నీలో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ టోర్నీలో ఎవరూ విజేతగా నిలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లు ఏవి అనేది ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో విశ్లేషించాడు. ఈ సారి ఛాంపియన్స్ టోఫ్రీ కోసం ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పాంటింగ్ వ్యాఖ్యలను టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం అంగీకరించాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఛాంపియన్స్ ట్రోఫీని చెరో రెండు సార్లు నెగ్గాయి. ఈ రెండు జట్ల ప్రదర్శన ఇటీవల చాలా అద్భుతంగా ఉంది. ప్లేయర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అని పాంటింగ్ చెప్పాడు. అదే సమయంలో మరో టీమ్ సైతం రేసులో ఉంటుందన్నాడు. ఇలాంటి టోర్నీల్లో పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. స్వదేశంలో పాక్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుందన్నాడు. కాబట్టి పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఇదే..
భద్రతా కారణాలతో పాకిస్తాన్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించడంతో భారత్ ఆడే మ్యాచులు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరగనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఇక టోర్నీలో గ్రూప్ దశలో న్యూజిలాండ్‌తో మార్చి 2న తన ఆఖరి మ్యాచ్‌ను భారత్ ఆడనుంది.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో
ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో
మార్చి 2న న్యూజిలాండ్‌తో