×
Ad

AUS vs ENG : తొలి టెస్టులో ఘోర ఓట‌మి.. అయినా స‌రే అదే దారి.. రెండో టెస్టుకు రెండు రోజుల ముందే..

ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో (AUS vs ENG) ఇంగ్లాండ్‌కు గొప్ప ఆరంభం ల‌భించ‌లేదు.

Ashes AUS vs ENG 2nd test England playing XI Will Jacks replaces Mark Wood

AUS vs ENG : ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు గొప్ప ఆరంభం ల‌భించ‌లేదు. పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇక గురువారం (డిసెంబ‌ర్ 4) నుంచి గ‌బ్బా వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

కాగా.. ఈ మ్యాచ్ (AUS vs ENG) ప్రారంభానికి ఇంకా రెండు రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి కూడా ఇంగ్లాండ్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. తొలి టెస్టు ఆడిన తుది జ‌ట్టులో కేవ‌లం ఒకే ఒక మార్పు చేసింది. గాయం కార‌ణంగా మార్క్‌వుడ్ రెండో టెస్టుకు దూరం కాగా.. అత‌డి స్థానంలో ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌కు చోటు ఇచ్చింది.

IPL : ఐపీఎల్ ద్వారా 92 కోట్లు సంపాదించాడు.. క‌ట్ చేస్తే.. వేలం నుంచి ఔట్‌..

ఇక తొలి టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

IND vs SA : రెండో వ‌న్డేకు ఆతిథ్యం ఇవ్వ‌నున్న రాయ్‌పుర్ స్టేడియం.. అప్పుడు బౌల‌ర్ల‌కు.. ఇప్పుడు ఎవ‌రికో?

రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.