Courtesy BCCI
ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనికుమార్ ఐపీఎల్ లో అదిరిపోయే అరంగ్రేటం చేశాడు. సోమవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అశ్వని కుమార్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతాను 116 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అశ్వని కుమార్‌ను రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. ఇక తొలి మ్యాచ్‌లో అశ్వనికుమార్ అదిరిపోయే ప్రదర్శన చేసిన తరువాత అతడి తండ్రి హర్కేశ్ కుమార్ మీడియాతో మాట్లాడాడు. తన కొడుకుకు క్రికెట్ అంటే ప్రాణం అని చెప్పుకొచ్చాడు.
BCCI : కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ..
నైపుణ్యాలను పెంచుకునేందుకు అశ్వని నిరంతరం పరితమిస్తుంటాడని అన్నాడు. ఎండనక, వానకక శ్రమించేవాడని, శిక్షణకు అస్సలు డుమ్మా కొట్టేవాడు కాదని చెప్పాడు. ట్రైనింగ్ పూరైన తరువాత రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చేవాడని, మళ్లీ ఉదయం 5 గంటలకే క్రికెట్ అకాడమీలో ఉండేవాడని అన్నారు.
కొన్ని సందర్భాల్లో సైకిల్ పై వెళ్లేవాడని, మరికొన్ని సందర్భాల్లో షేర్ ఆటోలో వెళ్లేవాడని, ఇంకొన్ని సార్లు లిఫ్ట్ అడిగి వెళ్లేవాడని తెలిపాడు. ఆటోలో వెళ్లేందుకు తనను రూ.30 అడిగేవాడన్నాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. సౌండ్ అదిరిపోద్ది..
అతడిని ముంబై వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది. తాను తీసుకున్న పైసాకు న్యాయం చేశాడని చెప్పాడు. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ముంబై విజయంలో కృషి చేశాడని హర్కేశ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.