ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తాము వదిలివేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ట్రేండ్ విండో అమల్లో ఉండడంతో పలువురు స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా అశ్విన్ స్పందించాడు.
ఆ వార్తలు అన్ని అవాస్తవాలేనని చెప్పాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంఛైజీ తనను ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటుందో స్పష్టత ఇవ్వాల్సిందిగా మాత్రమే కోరినట్లు తెలిపాడు. తాను రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నప్పుడు ఒక సంవత్సరం పూర్తి కాగానే ఆర్ఆర్ సీఈఓ మెయిల్ చేసేవారని, తమ ఆటతీరుపై విశ్లేషించేవారన్నాడు. “మేము ఇది.. మాకు ఇది కావాలి. మీ కాంట్రాక్టు్‌ను తదుపరి సంవత్సరం కూడా పునరుద్దరిస్తున్నాం.. అని చెప్పేవారు. ఇలా ప్రతి సంవత్సరం (1+1+1 ) కాంట్రాక్టును పునరుద్దరించే వాళ్లు.” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.
ఒకవేళ జట్టు వ్యూహాత్మక ప్రణాళికల్లో తాను ఇమడలేని పరిస్థితి ఉంటే.. విడిపోవడానికి అభ్యంతరం లేదని అశ్విన్ చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై జట్టు అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 9 మాత్రమే ఆడింది.
2009లో అశ్విన్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి అతడు ఓ సీజన్‌లో 12 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సీజన్‌లో 9.12 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.
Womens Odi WC 2025 : వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఇంకో 50 రోజులే..
రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజూ శాంసన్ వీడే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కోసం చెన్నై, కోల్‌కతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అశ్విన్‌ను రాజస్థాన్ కు ట్రేడ్ చేసి సంజూని తీసుకోవచ్చునని ప్రచారం జరుగుతోంది.