Asia Cup 2025 : నితీశ్ నుంచి అభిషేక్ వరకు.. ఆసియాకప్ 2025లో సన్‌రైజర్స్ నుంచి ఇద్దరా? ముగ్గురా ?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.

Two or three players contention for India Squad Selection in Asia Cup 2025
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీలో 8 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 28 న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలక్టర్లు ఆగస్టు మూడో వారంలో జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మెగాటోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఎంత మంది ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకుంటారో ఓ సారి చూద్దాం..
అభిషేక్ శర్మ..
గత కొంతకాలంగా టీమ్ఇండియా టీ20 జట్టుకు రెగ్యులర్ ఓపెనర్‌గా ఉంటున్నాడు అభిషేక్ శర్మ. సంజూశాంసన్‌తో కలిసి అతడు జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. ఎడమచేతి వాటం ఆటగాడు కూడా కావడంతో అతడికి ఆసియా కప్‌లో చోటు దక్కడం చాలా సులభమమే..
నితీశ్ కుమార్‌రెడ్డి..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు రెగ్యులర్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉంటూ వస్తున్నాడు. యూఏఈ పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ ఉండడంతో నితీశ్‌కుమార్ రెడ్డికి చోటు దక్కడం కష్టమే. ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లకు జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావించినా కూడా నితీశ్.. శివమ్ దూబేతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. అతడు గాయం నుంచి కోలుకున్నాడా? లేదా అన్నది తెలియరాలేదు.
MS Dhoni : వచ్చే సీజన్ ఆడతారా..? ఫ్యాన్స్ ప్రశ్నకు ధోని హిలేరియస్ సమాధానం.. వీడియో వైరల్..
ఇషాన్ కిషన్..
సంజూశాంసన్, అభిషేక్ శర్మలు రెగ్యులర్ ఓపెనర్లుగా ఉండడంతో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను చోటు దక్కడం కష్టమే. పోనీ వికెట్ కీపర్ బ్యాటర్‌గా అయినా చోటు దక్కించుకునే అవకాశం ఉందా అంటే.. శాంసన్ ఎలాగో వికెట్ కీపింగ్ చేయగలడు. పోనీ సంజూను బ్యాటర్‌గా తీసుకున్నా కూడా ఇషాన్‌కు చోటు దక్కడం అంత సులభం కాదు. స్పెషలిస్టు కీపర్‌గా ధ్రువ్ జురెల్‌తో అతడు పోటీ పడాల్సి ఉంటుంది.