Womens Odi WC 2025 : వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఇంకో 50 రోజులే..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

countdown has begun just 50 days away from ICC Womens Cricket World Cup 2025
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్‌తో పాటు పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు.
8 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. అయితే.. ఇటీవల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ పెద్ద ఈవెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేడుకలు అక్కడ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
The countdown has begun!
We are now just 50 days away from ICC Women’s Cricket World Cup, 2025.
India previously hosted the Women’s @cricketworldcup in 1978, 1997 and 2013. #CWC25 pic.twitter.com/HEqoLflqqc
— BCCI Women (@BCCIWomen) August 11, 2025
MS Dhoni : వచ్చే సీజన్ ఆడతారా..? ఫ్యాన్స్ ప్రశ్నకు ధోని హిలేరియస్ సమాధానం.. వీడియో వైరల్..
అందని ద్రాక్ష.. ఉరిస్తూ..
1973 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. ఇప్పటి వరకు 12 సార్లు ఈ మెగాటోర్నీ జరిగింది. భారత మహిళా జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. 2005, 2007లో ఫైనల్ చేరినప్పటికి కూడా తృటిలో కప్ చేజారింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నాయకత్వంలోనైనా ప్రపంచకప్ కల నెరవేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కీలక ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు రాణించాలని కోరుకుంటున్నారు. కాగా.. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.