Asia Cup 2023: ఆసియా కప్‌కు వేళైంది.. ఇవాళ పాకిస్థాన్ వేదికగా తొలి మ్యాచ్.. టోర్నీలో మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ..

శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది.

Asia Cup 2023

Asia Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది. ఈ టోర్నీలో సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం ఆరు టీంలు పాల్గొంటుండగా.. 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఆసియా కప్ -2023కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. దీంతో పాకిస్థాన్ లోని ముల్తాన్ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.

Asia Cup 2023 : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. పాక్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు, గ్రూప్ – బిలో ఆప్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ మైదానాల్లో టీమిండియా ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో ఈసారి హైబ్రీడ్ మోడల్‌లో టోర్నీ జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌లలో పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగతా తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్ లు వారి సొంతగడ్డపై జరగనుండగా, భారత్ ఆడబోయే మ్యాచ్ లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి.

Asia Cup 2023 : ఆసియా క‌ప్ మ్యాచుల‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్క‌డంటే..?

ఇవాళ సాయంత్రం పాకిస్థాన్ – నేపాల్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అంతకుముందు పాకిస్థాన్ లోని ముల్తాన్ వేదికగా టోర్నీఆరంభం వేడుక జరుగుతుంది. అయితే, ఈ ఆరంభ వేడుకకు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రెసిడెంట్ జకా అష్రాఫ్ వెల్లడించారు. అయితే, బీసీసీఐ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. అంతేకాకుండా సూపర్-4 దశలోనూ ఒక్కో జట్టు మిగతా టీంలతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ టోర్నీలో రెండుసార్లు ఇరుజట్లు తలపడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే క్రికెట్ అభిమానులకు పండగేనని చెప్పొచ్చు.

Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తిలక్ వర్మకు అవకాశం.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ

శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది. గత ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు ఫైనల్ కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి ఆసియా కప్ తో భారత్ తిరిగి వస్తామని టీమిండియా క్రికెటర్లు దీమాతో ఉన్నారు.

ఆసియా కప్ -2023 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..

Asia Cup 2023 Schedule

ట్రెండింగ్ వార్తలు