Asia cup 2025 final Pakistan Captain Salman Ali Agha Throwing Away Runners Up Cheque
IND vs PAK : ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ (IND vs PAK) అనంతరం నిర్వహించిన ప్రెజెంటేషన్ వేడుకలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రవర్తన పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 57 పరుగులు), ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46 పరుగులు) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
BCCI : దటీజ్ బీసీసీఐ.. టీమ్ఇండియాకు 21 కోట్ల ప్రైజ్‌మనీ.. ‘3-0’ అంటూ పాక్ ఇజ్జత్ తీసింది..
ఆ తరువాత 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో తిలక్ వర్మ (53 బంతుల్లో 69 పరుగులు) అర్ధశతకం బాదాడు. శివమ్ దూబె (33)), సంజూ శాంసన్ (24) రాణించారు. పాక్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ మూడు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
ఇక మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నరప్ చెక్కును అందుకున్న తర్వాత సల్మాన్ అలీ అఘా నిరాశతో దాన్ని విసిరివేశాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన మైదానంలోని ప్రేక్షకులు అతడిని ఎగతాళి చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు సైతం అతడి ప్రవర్తనపై మండిపడుతున్నారు.
Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj
— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025
IND vs PAK : ‘అబ్బే.. ట్రోఫీ మాకొద్దు..’ పాక్ పై గెలిచినా కప్పు తీసుకోని భారత్.. ఎందుకో తెలుసా?
ఫైనల్‌లో తమ జట్టు ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఈ ఓటమి తమను నిరాశకు గురి చేసిందన్నాడు. జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. బ్యాటింగ్‌తో తాము విఫలం కావడమే ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. అయినప్పటికి బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబు ఇచ్చాడు. బ్యాటింగ్ మెరుగ్గా రాణించి ఇంకో 15 నుంచి 20 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.