BCCI : దటీజ్ బీసీసీఐ.. టీమ్ఇండియాకు 21 కోట్ల ప్రైజ్‌మనీ.. ‘3-0’ అంటూ పాక్ ఇజ్జత్ తీసింది..
ఆసియాకప్ 2025 విజేతగా నిలిచినందుకు భారత జట్టుకు పెద్ద మొత్తంలో బీసీసీఐ (BCCI ) ప్రైజ్‌మనీని ప్రకటించింది.

BCCI : ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. తొమ్మిదో సారి ఈ ట్రోఫీని భారత్ ముద్దాడింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసియాకప్ గెలవడంతో టీమ్ఇండియా ఆటగాళ్లపై బీసీసీఐ నగదు వర్షం కురిపించింది.
విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.21 కోట్లు ప్రైజ్‌మనీగా అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తాన్ని భారత ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో 3-0 అంటూ పాకిస్తాన్ విమర్శించింది.
IND vs PAK : ‘అబ్బే.. ట్రోఫీ మాకొద్దు..’ పాక్ పై గెలిచినా కప్పు తీసుకోని భారత్.. ఎందుకో తెలుసా?
3 blows.
0 response.
Asia Cup Champions.
Message delivered. 🇮🇳21 crores prize money for the team and support staff. #AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/y4LzMv15ZC
— BCCI (@BCCI) September 28, 2025
ఈ మెగాటోర్నీలో పాకిస్తాన్‌తో భారత్ మూడు సార్లు తలపడగా అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమ్ఇండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే బీసీసీఐ ప్రస్తావిస్తూ పాక్ ఇజ్జత్ తీసింది.
ఆసియాకప్ గెలిచినందుకు రూ.2.6 కోట్లు..
ఆసియాకప్ గెలిచినందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి భారత జట్టు $300,000 (సుమారు రూ. 2.6 కోట్లు) అందుకుంటుంది. 2023 ఎడిషన్‌తో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం కావడం గమనార్హం. ఇక రన్నరప్‌గా నిలిచిన పాక్ జట్టుకు $150,000 (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ అందుకోనుంది.
Asia Cup 2025 : ఆపరేషన్ తిలక్.. అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. తొమ్మిదోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న టీమిండియా
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సాహిబ్జాదా ఫర్హాన్ (57; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫఖర్ జమాన్ (46; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత తిలక్ వర్మ (69; 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. శివమ్ దూబె (33; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ (24; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు సమయోచితంగా రాణించడంతో 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి అందుకుంది.