Asia Cup 2025 India vs Pakistan
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ -2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ మండలి (ACC) విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9 నుంచి 28వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఆసియా కప్ -2025లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు భాగాలు విభజించారు. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, యుఎఇ, ఒమన్ జట్లు ఉండగా.. గ్రూప్ -బిలో శ్రీలకం, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. అయితే, ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి. లీగ్ దశలో భారత జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. తొలుత లీగ్ దశలో సెప్టెంబర్ 14వ తేదీన భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న తలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి ఇరు జట్లు తలపడే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పొచ్చు.
తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం..
లీగ్ దశ షెడ్యూల్ .
సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్
సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ
సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్
సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్
సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్
సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్
సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్
సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ
సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్
సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్
సూపర్ 4 దశ ..
సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)
సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)
సెప్టెంబరు 23: A2 vs B1
సెప్టెంబరు 24: A1 vs B2
సెప్టెంబరు 25: A2 vs B2
సెప్టెంబరు 26: A1 vs B1
సెప్టెంబరు 28: ఫైనల్.
🚨 HERE IS THE FULL SCHEDULE OF ASIA CUP 2025 🚨 pic.twitter.com/YLYw0fLnM1
— Johns. (@CricCrazyJohns) July 26, 2025