IND vs ENG: రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడా..? క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్.. ఏమన్నాడంటే..?

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.

IND vs ENG: రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడా..? క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్.. ఏమన్నాడంటే..?

Rishabh Pant

Updated On : July 27, 2025 / 7:27 AM IST

Rishabh Pant: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 174/2 పరుగులు చేసింది. తద్వారా.. ఇంగ్లాండ్ జట్టు కంటే మరో 137 పరుగులు వెనుకబడి ఉంది. ఐదో రోజు (ఆదివారం) మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ తీరుపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

Also Read: ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్‌ను చిక్కుల్లో ప‌డేసిన బౌలింగ్ కోచ్.. అరెరె ఇప్పుడెలా సామీ..

ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో వెనుకబడిన టీమిండియాకు సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి లేదా డ్రా చేసుకోవాలి. విజయావకాశాలు మూడోరోజే చేజారాయి. నాలుగో రోజు ఒక దశ వరకు ఆటచూస్తే.. ఓటమి తప్పదనే అనిపించింది. జైస్వాల్, సుందర్శన్‌లు డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టిన తరువాత.. రాహుల్ (87 బ్యాటింగ్), గిల్ (78 బ్యాటింగ్) అద్భుత బ్యాటింగ్‌తో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ (ఐదోరోజు) జరిగే మ్యాచ్‌లో రాహుల్, గిల్ క్రీజులో పాతుకుపోతేనే మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


చివరి రోజు ఉదయం కొత్త బంతితో ఆర్చర్, వోక్స్, స్టోక్స్, కార్స్‌లను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. రాహుల్, గిల్ ఐదోరోజు కూడా ఇదే పోరాట పటిమను కొనసాగిస్తే డ్రా దిశగా నాల్గో టెస్టు పయణిస్తుంది. రాహుల్, గిల్ ఔట్ అయినా.. రిషబ్ పంత్, జడేజా లాంటి వాళ్లు క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ ను డ్రావైపు నడిపించాల్సి ఉంటుంది.

అయితే, తొలి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో తొలిరోజు మైదానం నుంచి రిటైర్డ్ హట్ గా వెళ్లిపోయాడు. మరుసటి రోజు బ్యాటింగ్ కు వచ్చిన పంత్.. గాయంతో ఒకపక్క ఇబ్బందిపడుతూనే అద్భుతమైన (75 బంతుల్లో 54 పరుగులు) ఆటతీరును కనబర్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్ లో పంత్ క్రీజులోకి వస్తాడా? లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై బ్యాటింగ్ కోచ్ క్లారిటీ ఇచ్చాడు. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ఐదో రోజు (ఆదివారం) భారత రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పారు.

తొలి ఇన్నింగ్స్..
భారత జట్టు : 358
ఇంగ్లాండ్ జట్టు : 669
రెండో ఇన్నింగ్ష్..
భారత జట్టు : 174/2