×
Ad

IND vs PAK : పాక్‌తో ఫైన‌ల్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! గాయ‌ప‌డిన హార్దిక్ పాండ్యా, అభిషేక్ శ‌ర్మ‌!

ఆదివారం పాక్‌తో (IND vs PAK) జ‌రిగే ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గాయాల బెడ‌ద మొద‌లైంది.

Asia Cup 2025 Hardik Pandya and Abhishek injury scare to team india ahead of final against pakistan

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు (IND vs PAK) ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌లు త‌గిలాయి. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు అయిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యాలు గాయాలతో బాధ‌ప‌డుతున్నారు. సూప‌ర్‌-4లో భాగంగా శ్రీలంకతో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శ‌ర్మ ఆ త‌రువాత ఫీల్డింగ్ కు రాలేదు.

అటు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ను వేసిన త‌రువాత మైదానం వీడాడు. మ‌ళ్లీ అత‌డు గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌లేదు. దీంతో వీరిద్ద‌రికి ఏమైందోన‌ని అభిమానులు కంగూరు ప‌డుతున్నారు.

Charith Asalanka : అందుకే సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడిపోయాం.. లేదంటేనా.. శ్రీలంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక కామెంట్స్

కాగా.. అభిషేక్ శ‌ర్మ క్రాంప్స్‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అటు హార్దిక్ పాండ్యా కండ‌రాలు ప‌ట్టేయ‌డంతోనే మ‌ళ్లీ బౌలింగ్ చేయ‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రి గాయాల‌పై ప్ర‌స్తుతానికి ఎలాంటి స‌మాచారం లేదు. ఒక‌వేళ అవి తీవ్ర‌మైన‌యి అయి వీరుద్ద‌రు పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయితే మాత్రం టీమ్ఇండియాకు అది గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా సూప‌ర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శ‌ర్మ త‌న దూకుడైన బ్యాటింగ్‌తో భార‌త్‌కు మెరుపు ఆరంభాల‌ను అందిస్తున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. అభిషేక్ శ‌ర్మ (61; 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (49 నాటౌట్; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సంజూ శాంస‌న్ (39; 23 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) లు దంచికొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది.

Asia Cup 2025 : భార‌త్, పాక్ ఫైన‌ల్‌ కోసం బంగ్లాదేశ్ కి అన్యాయం?.. రెండు నెలల ముందే ఫిక్స్..!

ఆ త‌రువాత పాతుమ్ నిస్సాంక (107; 58 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ, కుశాల్ పెరీరా (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో లంక జ‌ట్టు కూడా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 202 ప‌రుగులు చేయ‌డంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక జ‌ట్టు 5 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 2 ప‌రుగులు చేసింది. భార‌త జ‌ట్టు తొలి బంతికే మూడు ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది.