Asia Cup 2025 IND vs PAK Pakistan Embarrassed In Dubai Jalebi Baby Played Instead Of National Anthem
IND vs PAK : ఆసియాకప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు చిన్న పొరపాటు చోటు చేసుకుంది. ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు జాతీయ గీతాలాపన ఆలపించడం ఆనవాయితీ. ముందుగా పాక్ ప్లేయర్లు జాతీయ గీతాన్ని ఆలపించడానికి సిద్ధం అయ్యారు.
అయితే.. నిర్వాహకులు పొరపాటుగా పంజాబీ-ఇంగ్లీష్ పాప్ సాంగ్ జలేబీ బేజీ ని ప్లే చేశారు. దీన్ని విని పాక్ ఆటగాళ్లు అయోమయానికి గురి అయ్యారు. వెంటనే తప్పిదాన్ని గుర్తించిన నిర్వాహకులు ఆరు సెకన్ల తరువాత పాక్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
DJ played Jalebi Baby song on Pakistan National anthem 🤣#INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI
— 𝗩 𝗔 𝗥 𝗗 𝗛 𝗔 𝗡 (@ImHvardhan21) September 14, 2025
ఆసియాకప్ టోర్నీ ఆరంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాస్త అంటీముట్టనట్లుగా వ్యవహరించిన భారత్, పాక్ కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ అఘాలు .. ఆదివారం మ్యాచ్ సమయంలోనూ అలాగే వ్యవహరించారు. టాస్ సందర్భంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోకుండానే టాస్ తంతు పూర్తి చేశారు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పాక్ పై ఒకే ఒక్క భారతీయుడు..
Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40), షహీన్ షా అఫ్రిది (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), అభిషేక్ శర్మ (31), తిలక్ వర్మ (31) లు రాణించారు. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ మూడు వికెట్లు తీశాడు.