Asia Cup 2025 India Squad Who Is Likely to Play vs Pakistan
IND vs PAK : ఆసియాకప్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈమెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ బుధవారం (సెప్టెంబర్ 10న) ఆతిథ్య యూఏఈతో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.
ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న (IND vs PAK) జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇరు జట్లు ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలు డిమాండ్లు వచ్చాయి. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్‌లో పాక్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో ఆసియాకప్‌లోనూ పాక్‌తోనూ టీమ్ఇండియా ఆడదని భావించారు.
అయితే బీసీసీఐ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీలో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు పాక్‌తో ఆడదు.
సెప్టెంబర్ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ఇండియా తుది కూర్పు ఎలాఉండబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏడాది తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వైస్ కెప్టెన్ హోదాలో శుభ్‌మన్ గిల్‌లు జట్టులో ఉంటారు.
భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడడం ఖాయం. గత ఏడాది కాలంగా ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేసినప్పటికి తుది జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవచ్చు. గత ఏడాది కాలంలో వన్‌డౌన్‌లో మెరుపులు మెరిపిస్తున్న తిలక్ వర్మ టాప్ ఆర్డర్‌లో చోటు దక్కవచ్చు.
Gautam Gambhir : ఆసియాకప్ కోసం కేకేఆర్ బ్యాగ్ తీసుకువెళ్లిన గౌతమ్ గంభీర్..
ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌లు చోటు దక్కవచ్చు. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ, స్పెషలిస్టు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు ఆడొచ్చు. పేస్ విభాగం విషయానికి వస్తే.. బుమ్రాతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు.
ఆల్‌రౌండర్లు ఉండడంతో భారత్ సమతుల్యమైన జట్టును కలిగి ఉంది. ఆసియాకప్‌లో ఇప్పటి వరకు భారత్, పాక్ లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌ల్లో పాక్ గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
పాక్‌తో ఆడే భారత జట్టు (అంచనా)..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.