Asia Cup 2025 Jaker Ali comments after Bangladesh lost match to Pakistan
Jaker Ali : ఆసియాకప్ 2025లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఫైనల్ చేరుకునే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పాక్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసినప్పటికి కూడా ఓడిపోవడంపై బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ (Jaker Ali) స్పందించాడు. బ్యాటర్లు విఫలం కావడమే తమ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చాడు. బ్యాటర్ల వైఫలం కావడంతోనే వరుసగా రెండు రోజులు రెండు మ్యాచ్‌ల్లో భారత్, పాక్ చేతిలో ఓడిపోయినట్లుగా వివరించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హారిస్ (23 బంతుల్లో 31 పరుగులు), మహ్మద్ నవాజ్ (15 బంతుల్లో 25 పరుగులు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మెహేదీ హసన్, రిషద్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు సాధించారు. ముస్తాఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ పడగొట్టాడు.
PAK vs BAN : ఇది కదా పాకిస్తాన్ అంటే.. స్కూల్ లెవల్ ఫీల్డింగ్.. వీడియో వైరల్..
ఆ తరువాత షమీమ్ హుస్సేన్ (30; 25 బంతుల్లో 2 సిక్సర్లు) రాణించినప్పటికి మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో 136 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది, హరీస్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సైమ్ అయూబ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ ఓ వికెట్ సాధించాడు.
మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ మాట్లాడుతూ.. ఓ బ్యాటింగ్ యూనిట్‌గా గత రెండు మ్యాచ్‌ల్లో తాము ఘోరంగా విఫలం అయ్యామని చెప్పుకొచ్చాడు. అందుచేతనే తాము ఈ మ్యాచ్‌ల్లో ఓడిపోయినట్లుగా వివరించాడు. ఇక బౌలింగ్ యూనిట్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించిందన్నాడు. తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డేల్లో సిక్సర్ల కింగ్..
రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడడంతో జాకీర్ అలీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలను చేపట్టాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు చేతనైనంతలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించానని, కొన్ని లోటు పాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించినట్లుగా చెప్పాడు. బ్యాటింగ్‌లో సైఫ్, బౌలింగ్‌లో రిషాద్ రాణించారని అన్నాడు.