Asia Cup 2025 : సెప్టెంబ‌ర్ 10 నుంచి ఆసియా క‌ప్‌! భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ ఉంటుందా?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబ‌ర్ 10 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

Asia Cup 2025 likely to begin on September 10 reports

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబ‌ర్ 10 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది. అయితే.. ఇటీవల ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఉంటుందా? ఉండ‌దా? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీకి భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. ఆరు జ‌ట్లు.. అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, భార‌త్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, యూఎఈ లు ఈ మెగాటోర్నీలో పాల్గొనున్నాయి.అయితే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు పాక్‌తో జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం.. పాక్ మ్యాచ్‌ల‌ను యూఏఈలో లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. భార‌త జ‌ట్టుకు ఊర‌ట‌.. గంభీర్ ఏం చేస్తాడో మ‌రీ..

ఇటీవ‌ల ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాక్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు పెరిగాయి. ఈ క్ర‌మంలో రెండు జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయా? ఒక‌వేళ పాల్గొన్నా కూడా క‌లిసి ఆడ‌తాయా? అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యించాయి. అదే స‌మ‌యంలో ఆసియా క‌ప్ నుంచి భార‌త్ వైదొల‌గాల‌నే నిర్ణ‌యం తీసుకుంద‌నే వార్త‌లు వినిపించాయి.

‘ఆసియాకప్‌లో పాల్గొన‌క‌పోవ‌డం లేదా మ్యాచ్‌ల‌ను బాయ్‌క‌ట్ చేయ‌డం గురుంచి ఎటువంటి చర్చ కూడా జ‌ర‌గ‌లేదు. ఐసీసీ ఈవెంట్ల‌లో మేము పాకిస్తాన్‌తో ఆడుతాము. ప్ర‌భుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము న‌డుచుకుంటాము.’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపిన‌ట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్‌ తెలిపింది.

Travis Head : చ‌రిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌.. డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లోనే ఏకైక ప్లేయ‌ర్‌..

2025 మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. దీనిపై అటు పీసీబీ, ఇటు బీసీసీఐ నుంచి వ్య‌తిరేక‌త రాలేదు. దీంతో ఆసియా క‌ప్‌లో భార‌త్‌, పాక్‌లు ఒకే గ్రూపులో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.