Travis Head : చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. డబ్ల్యూటీసీ చరిత్రలోనే ఏకైక ప్లేయర్..
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు

Travis Head becomes the first Player to win 10 POTM awards in WTC History
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న తరువాత హెడ్ ఈ ఘనత సాధించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో హెడ్‌కు ఇది 10వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. అతడు దీన్ని కేవలం 50 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు.
ఇక ఈ జాబితాలో హెడ్ తరువాతి స్థానాల్లో ఇంగ్లీష్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జో రూట్‌లు ఉన్నారు. వీరిద్దరు చెరో ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. 49 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసేందుకు అడుగుదూరంలో జైస్వాల్..
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లు వీరే..
* ట్రావిస్ హెడ్ – 10 సార్లు
* బెన్ స్టోక్స్ – 5 సార్లు
* జో రూట్ – 5 సార్లు
* హ్యారీ బ్రూక్ – 4 సార్లు
ఇక ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులే చేసింది. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
Gautam Gambhir : గంభీర్ కోచ్ పదవికి ఎసరు.. గెలిచిన మ్యాచ్‌ల కంటే ఓడిందే ఎక్కువ..
🚨 HISTORY BY TRAVIS HEAD 🚨
– Travis Head becomes the first Player to win 10 POTM awards in WTC History, he completed the achievement from just 50 Tests. pic.twitter.com/H26PyjXHGq
— Johns. (@CricCrazyJohns) June 28, 2025
ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియా 310 పరుగులు చేసింది. దీంతో విండీస్ ముందు 301 పరుగుల లక్ష్యం నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 141 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో విజయం సాధించింది.