ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. భారత జట్టుకు ఊరట.. గంభీర్ ఏం చేస్తాడో మరీ..
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది

Bumrah returns to nets bowls full tilt during optional training session
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో భారత అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్త ఒకటి తెలిసింది. శుక్రవారం సెషన్‌లో పాల్గొనని టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా శనివారం జరిగిన నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. అరగంట పాటు అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
JASPRIT BUMRAH WORKING HARD FOR 2nd TEST 🇮🇳 [Sahil Malhotra] pic.twitter.com/Yy2DOysuvA
— Johns. (@CricCrazyJohns) June 28, 2025
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి నివ్వనున్నారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుమ్రా నెట్స్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. బుమ్రా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడని ఇప్పటికే టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఏ మూడు మ్యాచ్‌లు అన్నది చెప్పలేదు. తొలి టెస్టు ఆడిన బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. మిగిలిన నాలుగు టెస్టుల్లో అతడు ఏ రెండు ఆడతాడు అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
Travis Head : చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. డబ్ల్యూటీసీ చరిత్రలోనే ఏకైక ప్లేయర్..
సిరీస్ సమం చేయాలంటే బుమ్రా రెండో టెస్టు ఆడడం కీలకం. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్‌లు బుమ్రా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. ఇప్పటికే అనుభవలేమీతో ఇబ్బంది పడుతున్న భారత పేస్ దశం బుమ్రా లేకుంటే మరింత బలహీన పడడం ఖాయం.
ఇదిలా ఉంటే.. రెండో రోజు ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైశ్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ కావడంతో వీరు హాజరు కాలేదు.