India vs England: పొట్టుపొట్టు కొట్టేసింది.. ఇంగ్లాండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్.. శతకంతో సరికొత్త రికార్డులు నమోదు.. వీడియోలు వైరల్

ఇంగ్లాండ్‌ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.

India vs England: పొట్టుపొట్టు కొట్టేసింది.. ఇంగ్లాండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్.. శతకంతో సరికొత్త రికార్డులు నమోదు.. వీడియోలు వైరల్

Smriti Mandhana

Updated On : June 29, 2025 / 7:11 AM IST

Smriti Mandhana: ఇంగ్లాండ్‌ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లిష్ జట్టును ఏకంగా 97 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లు హడలిపోయారు. సిక్సులు, ఫోర్లతో ఇంగ్లిష్ బౌటర్లపై విరుచుకుపడింది. దీంతో 62 బంతుల్లోనే 112 పరుగులు చేసింది. ఇందులో 15 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి మంధాన సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

Also Read: ICC : టీ20ల్లో కొత్త రూల్‌.. ఇక పై ఓవ‌ర్లు కాదు.. బంతులే లెక్క‌..

తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయగా.. స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్ తో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లను భారత బౌలర్లు అద్భుత బౌలింగ్ ఇబ్బంది పెట్టారు. దీంతో కేవలం 14.5 ఓవర్లలో 113 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది.


టీ20ల్లో స్మృతి మంధానకు ఇదే తొలి సెంచరీ. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన భారత తొలి మహిళా బ్యాటర్ గా ఆమె రికార్డులకెక్కింది. మహిళా క్రికెట్లో హెదర్ నైట్, టామీ బ్యూమాంట్ (ఇంగ్లాండ్), లారా వోల్వార్ట్ (ఇంగ్లాండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా) మాత్రమే ఈ ఘనత సాధించారు. మరోవైపు.. మహిళల టీ20ల్లో భారత తరపును స్మృతి మంధానకు 112 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. హర్మన్ ప్రీత్ 2018లో న్యూజిలాండ్ జట్టుపై 103 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మృతి మంధాన ఆమెను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది.