Asia Cup 2025 : సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. యూఏఈ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిది జట్లు కప్పు కోసం (Asia Cup 2025 ) పోటీ పడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ లు గ్రూప్-ఏలో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ లు గ్రూప్-బిలో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. తాజాగా మ్యాచ్ ఆరంభ సమయాల్లో మార్పులు చేసింది యూఏఈ క్రికెట్ బోర్డు.
అరంగంట ఆలస్యంగా..
ఈ మెగాటోర్నీలో 19 మ్యాచ్‌లకు గానూ.. 18 మ్యాచ్‌లు (ఫైనల్‌తో సహా) మ్యాచ్‌లు అన్ని కూడా అరగంట ఆలస్యంగా అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.
Kieron Pollard : చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడమే అందుకు కారణం. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ- ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్ మాత్రం మారలేదు.
14న భారత్ వర్సెస్ పాక్..
ఈ మెగాటోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. ఆతిథ్య యూఏఈతో తలపడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. లీగ్ దశలో భారత జట్టు ఆఖరి మ్యాచ్ ఒమన్‌తో సెప్టెంబర్ 19న ఆడనుంది.
ఆసియా కప్ షెడ్యూల్ 2025 (Asia Cup 2025) ఇదే..
* సెప్టెంబరు 9న – అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 10న – భారత్ వర్సెస్ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 11న – బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 12న – పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 13న – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 14న – భారత్ వర్సెస్ పాకిస్తాన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 15న – యూఏఈ వర్సెస్ ఒమన్ – అబుదాబి (సాయంత్రం 5.30 నిమిషాలకు)
* సెప్టెంబరు 15న – శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబర్ 16న – బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్తాన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 17న – పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 18న – శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 19న – భారత్ వర్సెస్ ఒమన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
సూపర్ 4 స్టేజ్..
* సెప్టెంబరు 20న – గ్రూప్-బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 21న – గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 23న – A2 vs B1- దుబాయ్ ( రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 24 – A1 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 25న – A2 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 26న – A1 vs B1 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 28న – ఫైనల్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)