Kieron Pollard : చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 14వేలు పరుగులు..

Pollard Create History Becomes First Player to score 14000 runs and take 300 wickets in t20s
Kieron Pollard : వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 14వేలు పరుగులు చేయడంతో పాటు మూడు వందలకు పైగా వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పొలార్డ్ (Kieron Pollard )ఈ ఘనత సాధించాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్ బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేయడం ద్వారా దీన్ని అందుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులు సాధించాడు. ఇక రెండో స్థానంలో పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ 712 మ్యాచ్‌ల్లో 14000 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌లో 320 వికెట్లు తీశాడు.
MS Dhoni : ధోనికి బీసీసీఐ బంపర్ ఆఫర్.. ఒప్పుకుంటే ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాల్సిందేనా?
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* క్రిస్‌గేల్ – 14562 పరుగులు
* కీరన్ పొలార్డ్ – 14000 పరుగులు
* అలెక్స్ హేల్స్ – 13931 పరుగులు
* డేవిడ్ వార్నర్ – 13595 పరుగులు
* షోయబ్ మాలిక్ – 13571 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (45), కదీమ్ అలినే (41), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (31) లు రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ అమీర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలీఖాన్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కోలిన్ మున్రో (67; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ నికోలస్ పూరన్ (65 నాటౌట్; 40 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. కీరన్ పొలార్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్) వేగంగా ఆడాడు.