Asia Cup 2025 Pathum Nissanka smashes six but no runs added do you know why
IND vs SL : ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా శుక్రవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ మిస్ చేయగా అది బౌండరీ ఆవల పడింది. ఇది సిక్స్ అని శ్రీలంక ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా అంపైర్ వారికి షాక్ ఇచ్చాడు. డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంపైర్ డెడ్ బాల్ ఎందుకు ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఆ బంతి సిక్స్‌గా ఇచ్చి ఉంటే.. శ్రీలంక విజేతగా నిలిచి ఉండేదని అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులుచేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 పరుగులు), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39 పరుగులు) రాణించారు.
Asia cup 2025 : హరిస్ రవూఫ్, సూర్యకుమార్ యాదవ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. 30 శాతం జరిమానా.. ఇంకా..
అనంతరం 203 పరుగుల విజయలక్ష్యంతో లంక జట్టు బరిలోకి దిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోయి 103 పరుగులతో లక్ష్యం దిశగా సాగుతోంది. అప్పటికే పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్నాడు. 10వ ఓవర్‌ను వరుణ్ చక్రవర్తి వేశాడు. మూడో బంతికి నిస్సాంక లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఈజీగా క్యాచ్ అందుకుంటాడని అంతా భావించారు.
Chaos on the field! 😳
Varun delivers after the ump signals dead ball, Nissanka smashes it — and Axar palms a simple catch for SIX! 🫣
What just happened there?!#Nishanka #IndvsSL #AsiaCupT20 #Parera pic.twitter.com/6CEpjSbkQi
— Asia Voice 🎤 (@Asianewss) September 26, 2025
Abhishek Sharma : శ్రీలంక పై తుఫాన్ ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..
అయితే.. అక్షర్ చేతులోంచి జారీన బంతి బౌండరీ లైన్ దాటి పడింది. మామూలుగా అయితే ఈ బంతిని సిక్స్‌గా ప్రకటిస్తూ ఉంటారు. గానీ అంపైర్ మాత్రం డెడ్‌బాల్‌గా ప్రకటించాడు.
డెడ్‌బాల్ ఎందుకంటే..?
ఇక్కడ అంపైర్ నిబంధనల ప్రకారమే బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు వెలుతున్నాడు. అతడి స్థానంలో మరో ఫీల్డర్ లోపలికి వచ్చాడు. అభిషేక్ ఇంకా మైదానాన్ని వీడలేదు. ఈ విషయాన్ని గమనించని వరుణ్ చక్రవర్తి బంతిని వేశాడు. అతడు బాల్ వేస్తున్నప్పుడే అంపైర్ డెడ్‌బాల్‌గా సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని గమనించని నిస్సాంక ఆ బంతిని షాట్ ఆడగా అక్షర్ మిస్ చేయడంతో బౌండరీ ఆవల పడింది.
ఇక ఈ మ్యాచ్‌లో పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 పరుగులు) సెంచరీ చేయగా, కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) అర్థశతకంతో రాణించడంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 5 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. టీమ్ఇండియా తొలి బంతికే మూడు పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.