Asia Cup 2025: గిల్ నుంచి శాంసన్ వరకు.. పాకిస్తాన్‌తో ఇప్పటివరకు టీ20 ఆడని 9 మంది భారత క్రికెటర్లు వీరే..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ క్రికెటర్లు T20 ఫార్మాట్‌కు దూరమవడంతో ఇప్పుడు అందరి దృష్టి తమదైన ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్న కొత్త తరం వైపు మళ్లింది.

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. ఇరు దేశాల క్రికెటర్లు గ్రౌండ్ లో సమరానికి సన్నద్ధంగా ఉన్నారు. అటు ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. అదేమిటంటే.. పాక్ తో జరగబోయే టీ20లో ఏకంగా 9 మంది భారత క్రికెటర్లు అరంగ్రేటం చేసే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌తో సహా తొమ్మిది మంది భారత ఆటగాళ్ళు పాక్ తో T20Iలలో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ క్రికెటర్లు T20 ఫార్మాట్‌కు దూరమవడంతో ఇప్పుడు అందరి దృష్టి తమదైన ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్న కొత్త తరం వైపు మళ్లింది.

పాక్ తో ఇప్పటివరకు టీ20 ఆడని 9 మంది క్రికెటర్లు వీరే..

అభిషేక్ శర్మ – ఈ లెఫ్ట్ హ్యాండర్ క్రికెటర్ గత సంవత్సరం తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత్ తరపున 18 టీ20 మ్యాచ్ లు ఆడాడు. తన కెరీర్‌లో తొలిసారిగా పాకిస్తాన్‌తో తలపడటానికి సిద్ధంగా ఉన్నాడు.

శుభ్ మన్ గిల్ – కొత్తగా నియమితుడైన ఈ వైస్ కెప్టెన్ పాకిస్తాన్‌తో 4 వన్డేలు ఆడి 130 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఆదివారం తొలిసారిగా పాక్ తో టీ20 మ్యాచ్ ఆడనున్నాడు.

తిలక్ వర్మ – పాక్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు తిలక్ వర్మ చాలా ఆత్రుతగా ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఇండియాకు 26 టీ20లు ఆడాడు. 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సంజూ శాంసన్ – భారత్ తరపున సంజూ శాంసన్ 42 టీ20 మ్యాచ్ లు ఆడాడు. కానీ, ఇంతవరకు పాక్ తో ఆడింది లేదు. టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్ లో మెంబర్ అయినా ఆడే అవకాశం రాలేదు. చివరికి నిరీక్షణకు తెరపడనుంది. పాక్ తో తొలి టీ20 మ్యాచ్ లో ఆడబోతున్నాడు.

కుల్దీప్ యాదవ్ – పాకిస్తాన్ తో వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. కుల్దీప్ సత్తాను పాక్ చూసింది. 7 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. టీ20 ఫార్మాట్ లో తొలిసారి పాక్ తో మ్యాచ్ లో ఆడబోతున్నాడు.

రింకూ సింగ్ – ప్లేయింగ్ 11లో చోటు దక్కితే కనుక పాక్ తో తొలి 20 మ్యాచ్ ఆడబోతున్నాడు. భారత్ తరపున 33టీ20 మ్యాచ్ లు ఆడిన రింకూ సింగ్ 546 పరుగులు చేశాడు. యావరేజ్ 42.

వరుణ్ చక్రవర్తి – ఈ మిస్టరీ స్పిన్నర్ ను పాక్ ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసింది. వరుణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 19 టీ20 మ్యాచులు ఆడాడు. 34 వికెట్లు తీశాడు. ఆదివారం పాకిస్తాన్‌తో తన మొదటి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు.

హర్షిత్ రానా – ఈ రైట్ ఆర్మ్ క్రికెటర్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. తుది జట్టులో ఎంపిక అయితే.. భారత్ తరపున రెండో టీ20, పాక్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు.

జితేశ్ శర్మ – పాక్ తో మ్యాచ్ లో జితేష్ ఆడే అవకాశం లేదు. జితేశ్ స్థానంలో సంజూ శాంసన్ వచ్చాడు. జితేశ్ తన కెరీర్ లో ఇప్పటివరకు పాక్ తో మ్యాచ్ ఆడింది లేదు.

Also Read: ఏదీ ఏమైనా గానీ.. పాక్ పై ఆ రికార్డు సాధిస్తే.. ఆ కిక్కే వేర‌ప్పా.. చ‌రిత్ర‌కు అడుగుదూరంలో అర్ష్‌దీప్ సింగ్‌..