Asia cup 2025 Starts from today first match between afghanistan vs hong kong
Asia cup 2025 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నేటి (మంగళవారం సెప్టెంబర్ 9) నుంచి ఆసియాకప్ 2025 (Asia cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. 8 జట్లు కప్పు కోసం పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ దేశాలు గ్రూప్-ఏలో ఉండగా బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్‌కాంగ్, అఫ్గానిస్తాన్‌లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
అబుదాబి, దుబాయ్ నగరాల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇది మూడోసారి మాత్రమే.
భారత షెడ్యూల్ ఇదే..
ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఆ తరువాత చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇక గ్రూప్ స్టేజీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.
ప్రత్యక్షప్రసారం ఎక్కడంటే?
సోని నెట్‌వర్క్ భారత దేశంలో ఆసియాకప్ 2025 మ్యాచ్‌ల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఆన్‌లైన్‌లో సోనీ లివ్ యాప్, వైబ్‌సైట్‌లో మ్యాచ్‌లను చూడొచ్చు.
ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..?
భారత జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. డీడీ స్పోర్ట్స్‌లో మ్యాచలను ఉచితంగా చూడొచ్చు.
* సెప్టెంబరు 9న – అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 10న – భారత్ వర్సెస్ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 11న – బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 12న – పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 13న – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 14న – భారత్ వర్సెస్ పాకిస్తాన్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 15న – యూఏఈ వర్సెస్ ఒమన్ – అబుదాబి (సాయంత్రం 5.30 నిమిషాలకు)
* సెప్టెంబరు 15న – శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబర్ 16న – బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్తాన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 17న – పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 18న – శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 19న – భారత్ వర్సెస్ ఒమన్ – అబుదాబి (రాత్రి ఎనిమిది గంటలకు)
సూపర్ 4 స్టేజ్..
* సెప్టెంబరు 20న – గ్రూప్-బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 21న – గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2) – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 23న – A2 vs B1- దుబాయ్ ( రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 24 – A1 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 25న – A2 vs B2 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 26న – A1 vs B1 – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)
* సెప్టెంబరు 28న – ఫైనల్ – దుబాయ్ (రాత్రి ఎనిమిది గంటలకు)