Asia Cup 2025 Today match between Pakistan and United Arab Emirates
PAK vs UAE : ఆసియాకప్ 2025లో భారత జట్టు ఇప్పటికే సూపర్ 4కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూపు ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ లు ఉన్నాయి. గ్రూపు-ఏ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన రెండు జట్లు మాత్రమే సూపర్-4కి వెలుతాయన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే భారత్ సూపర్-4కి అర్హత సాధించింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఒమన్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఇక మిగిలిన రెండో బెర్తు కోసం పాకిస్తాన్, యూఏఈ జట్టు పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడగా ఒక్కొ మ్యాచ్‌లో గెలుపొందాయి. రెండు జట్ల ఖాతాలోనూ చెరో 2 పాయింట్లు ఉన్నాయి.
బుధవారం యూఏఈ, పాక్ జట్ల (PAK vs UAE) మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాలుగు పాయింట్లతో సూపర్-4లో అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్ యూఏఈకి ఓ అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సూపర్4కి వెలుతుంది.
మ్యాచ్ టై అయినా, రద్దు అయినా..
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయినా, టై అయినా కూడా ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు కూడా రెండు జట్ల ఖాతాలో సమానంగా పాయింట్లు ఉంటాయి. మెరుగైన నెట్ రన్‌రేటు కలిగి ఉన్న జట్టు సూపర్4లో అడుగుపెడుతోంది.
Handshake Row : ఐసీసీ యూటర్న్..! పాక్‌కు స్వల్ప విజయం.. ఆండీ పైక్రాఫ్ట్ ఎంత పనాయే..
ప్రస్తుతం పాక్ నెట్‌రన్‌రేటు +1.649గా ఉంది. యూఏఈ నెట్‌రన్‌రేటు -2.030గా ఉంది. ఈ లెక్కన మ్యాచ్ టై అయినా, రద్దు అయినా కూడా మెరుగైన రన్‌రేటు ఉన్న పాక్ జట్టు సూపర్4లో అడుగుపెడుతుంది.