×
Ad

Asia Cup Final : తిలక్ వర్మ భారీ సిక్స్.. గౌతమ్ గంభీర్ రియాక్షన్ చూశారా.. వావ్.. వీడియో వైరల్..

Asia Cup Final Gautam Gambhirs Reaction : తిలక్ వర్మ భారీ సిక్స్ కొట్టిన సమయంలో గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్‌గా మారింది.

Asia Cup Final Gautam Gambhirs Reaction

Asia Cup Final Gautam Gambhirs Reaction : ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, చివరిలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు కుర్రాడు.. టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించి విజయతీరాలకు చేర్చాడు. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోయాడు.

Also Read: Asia Cup 2025 : ఆపరేషన్ తిలక్.. అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. తొమ్మిదోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న టీమిండియా

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ చేశాడు. 53 బంతుల్లో 69 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి.


హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 10 పరుగులు కావాల్సి ఉంది. హారిస్ రవూఫ్ వేసిన ఓవర్లో మొదటి బంతికి రెండు పరుగులు వచ్చాయి. రవూఫ్ వేసిన రెండో బంతికి తిలక్ వర్మ భారీ సిక్స్ కొట్టడంతో టీమిండియా విజయం ఖరారైంది. దీంతో గౌతమ్ గంభీర్ తాను కుర్చున్న కుర్చీలో నుంచే తన ముందున్న డెస్క్ ను బలంగా కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిలక్ వర్మ కొట్టిన ఈ సిక్స్ తరువాత మిగిలిన పనిని రింకూ సింగ్ పూర్తి చేశాడు. అతను బంతిని బౌండరీ తరలించి టీమిండియా తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ విజయాన్ని ఖరారు చేశాడు.