India A vs Bangladesh A
India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భారత్ ఏ వర్సెస్ బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరిలో సూపర్ ఓవర్ కొనసాగింది. అయితే, ఈ సూపర్ ఓవర్లో భారత్ జట్టు బొక్కబోర్లా పడింది. తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేదు.. బంగ్లాదేశ్ సైతం తొలి బంతికి వికెట్ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్ శర్మ వైడ్ వేయడంతో ఆ జట్టు విజయం సాధించింది. అయితే, సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
భారత్ ఏ వర్సెస్ బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య మ్యాచ్ దోహా వేదికగా జరిగింది. టాస్ ఓడి తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ 46 బంతుల్లో 65 పరుగులతో రాణించాడు. మెహ్రాబ్ 18 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో గుర్‌జప్నీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. భారీ పరుగుల లక్ష్య చేధనతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ చివరిలో సూపర్ ఓవర్లో బోల్తా పడ్డారు.
భారీ లక్ష్య ఛేదనలో భారత్ జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 15బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సైతం రాణించాడు. అతను 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. వీరిద్దరూ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ ఆ తరువాత బ్యాటర్లు ఆ దూకుడును కొనసాగించలేక పోయారు. జితేశ్ శర్మ (33), నేహల్ వధేరా (32 నాటౌట్), ఆఖర్లో రమన్‌దీప్ (17), అశుతోష్ శర్మ (13) రాణించడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.
సూపర్ ఓవర్లో భారత్ జట్టు ఊహించని విధంగా బోల్తా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. జితేశ్, అశుతోష్ వెంటవెంటనే ఔట్ కావడంతో సూపర్ ఓవర్లో ఖాతా తెరవలేదు. ఆ తరువాత బంగ్లాదేశ్ జట్టు సైతం తొలి బంతికే వికెట్ కోల్పోయింది. అయితే రెండో బంతిని భారత బౌలర్ సుయాశ్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఓవర్ సమయంలో వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
🚨 What a match, what a thriller! 🤯
Bangladesh beat India in Super Over of Asia Cup Rising Stars 2025 semi-final. 🔥India, led by Jitesh Sharma, lost to Pakistan & now Bangladesh in semifinal.
In IPL 2025, Jitesh Sharma troll CSK fans by calling “Dosa, Idli, Sambar, Chutney” pic.twitter.com/VGht9TpurX
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 21, 2025