AUS vs ENG : బెంబేలెత్తించిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆరుగురు బ్యాటర్లు..
యాషెస్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
AUS vs ENG Ashes 2025 England 172 all out in 1st Innings against Australia in 1st test
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ (AUS vs ENG ) ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చుక్కలు చూపించాడు.
పేస్, స్వింగ్‌తో కూడిన బంతులను ఆడలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లతో ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర వహించాడు.
Joe Root : అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అవాంఛిత రికార్డును సమం చేసిన జో రూట్..
ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (52; 61 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా ఓలీ పోప్ (46; 58 బంతుల్లో 4 ఫోర్లు), జేమీ స్మిత్ (33; 22 బంతుల్లో 6 ఫోర్లు), బెన్ డకెట్ (21; 20 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే రెండు అంకెల స్కోర్లు సాధించారు. జాక్ క్రాలీ, జోరూట్, మార్క్‌వుడ్ లు డకౌట్ అయ్యారు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (6), గస్ అట్కిన్సన్ (1), బ్రైడాన్ కార్స్ (6) లు విఫలం అయ్యారు.
IND vs SA : యశస్వి జైస్వాల్.. నీ అహాన్ని కాస్త పక్కన పెట్టు.. లేదంటే..
England’s innings lasted only for 197 balls.
Courtesy – Mitchell Starc. 🔥 pic.twitter.com/3SzLv6sArA
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2025
