Joe Root : అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అవాంఛిత రికార్డును సమం చేసిన జో రూట్..
జోరూట్ (Joe Root ) ఏడు బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.
Joe Root equals Virat Kohli on unwanted international cricket list
Joe Root : యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అతడు తన తొలి ఓవర్‌లోనే జాక్ క్రాలీని పెలివియన్‌కు చేర్చాడు. తన తొలి ఏడు ఓవర్ల స్పెల్‌లోనే బెన్ డకెట్, జోరూట్ లను పెవిలియన్ కు చేర్చాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జోరూట్ (Joe Root ) ఏడు బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఇది రూట్ టెస్టు కెరీర్‌లో 14వ డకౌట్ కాగా.. యాషెస్ సిరీసుల్లో ఆరోది.
IND vs SA : యశస్వి జైస్వాల్.. నీ అహాన్ని కాస్త పక్కన పెట్టు.. లేదంటే..
Mitchell Starc has claimed his 100th wicket against England! #MilestoneMoment | #Ashes | @nrmainsurance pic.twitter.com/vItwfdCK3X
— cricket.com.au (@cricketcomau) November 21, 2025
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌లో రూట్‌కి ఇది తొమ్మిదో డకౌట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో అతడు విరాట్ కోహ్లీ, బ్రియాన్ లారా, స్టీఫెన్ ఫ్లెమింగ్, ముత్తయ్య మురళీధరన్, అలన్ డోనాల్డ్, అలెక్ స్టీవర్ట్, మోర్నీ మోర్కెల్ వంటి ప్లేయర్లను సమం చేశాడు. వీరందరూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది సార్లు డకౌట్లు అయ్యారు.
ఇక ఈ జాబితాలో కోర్ట్నీ వాల్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఆసీస్ పై 16 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా ఆటగాడు ఇషాంత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 13 సార్లు పరుగులు ఏమీ చేయలేదు.
