Astrologer Greenstone Lobo Big Captaincy Prediction For Shreyas Iyer
Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ 2025లో సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా నిలిచినప్పటికి కూడా సెలక్టర్లు అతడిని ఆసియాకప్‌కు ఎంపిక చేయలేదు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ పై మండిపడిన సంగతి తెలిసిందే. అయితే.. 2027లో టీమ్ఇండియా కెప్టెన్‌గా అయ్యర్ అవుతాడంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం చెప్పాడు.
భారత టీ20 జట్టులోకి అయ్యర్ తిరిగి వస్తాడని, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో పాల్గొనే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన చాట్‌లో జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో పేర్కొన్నాడు. ‘1994లో అయ్యర్ జన్మించాడు. అతడి జాతకంలో ఫ్లూటో గ్రహం అత్యున్నత స్థానంలో ఉంది. నెప్ట్యూన్ గ్రహం కూడా అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంది.’ అని లోబో చెప్పాడు.
‘అయ్యర్‌కు ఏదో ఒక ఫార్మాట్‌లో భారత దేశాన్ని నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. 2027లో అతడి గ్రహాలు అత్యంత శక్తివంతంగా మారుతాయి. అతడు జట్టులో భాగం కాబోతున్నాడు. అతడు ఆమెగాటోర్నీలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.’ అని అన్నాడు.
ఈ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి అయ్యర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
రోహిత్ స్థానంలో..
వన్డేల్లో ప్రస్తుతం భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 38 సంవత్సరాలు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి అతడికి 40 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించి ఓ యువ ఆటగాడికి నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని, ఆ ఆటగాడు, శ్రేయస్ అయ్యర్ అని వార్తలు వచ్చాయి. దీనిని ఓ బీసీసీఐ అధికారి ఖండించాడు. ఇటీవల జరిగిన సమావేశంలో వన్డే కెప్టెన్సీ పై ఎలాంటి చర్చ రాలేదన్నాడు.
Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు గుడ్‌బై..
అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఆతిథ్య జట్టులో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటికి వన్డే కెప్టెన్సీ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.