AUS vs ENG : ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ సవాల్.. తొలి టెస్టుకు రెండు రోజుల ముందే..
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ (AUS vs ENG) శుక్రవారం (నవంబర్ 21) నుంచి ప్రారంభం కానుంది
AUS vs ENG 12 player England Ashes squad for the first Test in Perth
AUS vs ENG : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ శుక్రవారం (నవంబర్ 21) నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ పెర్త్ వేదికగా మొదలుకానుంది. కాగా.. తొలి టెస్టు మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ఇంగ్లాండ్ జట్టు 12 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.
బెన్‌స్టోక్స్ నేతృత్వంలోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకున్న మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్‌లకు 12 మందిలో స్థానం దక్కింది. మ్యాచ్ జరిగే ఉదయం తుది 11 మందిపై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లాండ్ టీమ్ వెల్లడించింది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్.. జట్టుతో పాటు గౌహతి వెళ్తాడు గానీ..

జేకబ్ బెతెల్‌కు స్థానం లభిస్తుందని ఆశించినప్పటికి అలా జరగలేదు. ఫామ్‌లో లేకపోయినప్పటికి కూడా ఓలీ పోప్ పై ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని ఉంచింది.
Rohit Sharma : రోహిత్ శర్మకు భారీ షాక్.. వన్డేల్లో చేజారిన..
ఇదిలా ఉంటే.. పెర్త్ పిచ్ ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తుంది. ఈ లెక్కన తొలి టెస్టు తుది జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు స్థానం దక్కకపోవచ్చు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్ లు పేస్ భారాన్ని మోయనున్నారు. వీరికి తోడుగా కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా ఉండనే ఉన్నాడు.
ఆసీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ ప్రకటించిన 12 మంది సభ్యుల జట్టు ఇదే..
బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మార్క్ వుడ్.
