×
Ad

AUS vs ENG : వందేళ్ల‌లో ఇదే తొలిసారి.. యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం..

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు (AUS vs ENG)తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.

AUS vs ENG 1st Test day 1 stumps australia were 123 for 9

AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో బౌల‌ర్ల హ‌వా కొన‌సాగించింది. ఒక‌టి కాదు నాలుగు కాదు ఏకంగా 19 వికెట్లు తొలి రోజే నేల‌కూలాయి. గ‌త 100 ఏళ్ల యాషెస్ సిరీస్ చ‌రిత్ర‌లో తొలి రోజే 19 వికెట్లు ప‌డ‌డం ఇదే తొలిసారి. 2001లో ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో, 2005లో లార్డ్స్ టెస్టు మ్యాచ్‌ల్లో తొలి రోజు 17 వికెట్లు ప‌డ్డాయి.

యాషెస్‌ టెస్ట్‌ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన సంద‌ర్భం 1909 సంవ‌త్స‌రంలో చోటు చేసుకుంది. ఓల్డ్‌ ట్రాఫర్డ్ వేదిక‌గా జ‌రిగిన నాటి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే రికార్డు స్థాయిలో 20 ప‌డ్డాయి. అప్పుడు తొలుత ఆస్ట్రేలియా 147 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 119 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Smriti Mandhana : స్మృతి మంధానకు ప‌లాష్ ముచ్చ‌ల్ సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌.. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన చోటే..

ఇక తాజా మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 172 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో హ్యారీ బ్రూక్ (52), ఓలీ పోప్ (46), జేమీ స్మిత్ (33) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీశాడు. బ్రెండన్‌ డొగ్గెట్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ్రీన్ ఓ వికెట్ సాధించాడు.

ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. నాథ‌న్ లైయాన్ (3), బ్రెండ‌న్ డొగ్గెట్ (0) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 49 ప‌రుగుల దూరంలో ఉంది.

BAN vs IRE : భూకంపం కార‌ణంగా ఆగిపోయిన‌ బంగ్లాదేశ్, ఐర్లాండ్ మ్యాచ్‌.. భ‌యంతో మైదానంలోనే కూర్చున్న ఆట‌గాళ్లు.. వీడియో

ఇక ఆసీస్ బ్యాట‌ర్ల‌లో అలెక్స్ క్యారీ (26), కామెరూన్ గ్రీన్ (24), ట్రావిస్ మెడ్ (21), స్టీవ్ స్మిత్ (17) ల‌కు మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌లం అయ్యారు. ఉస్మాన్ ఖ‌వాజా (2) విఫ‌లం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోఫ్రా ఆర్చ‌ర్‌, బ్రైడన్‌ కార్స్ చెరో రెండు వికెట్లు తీశారు.