AUS vs ENG 2nd Test Joe Root Receives Standing Ovation England 334 All Out
AUS vs ENG 2nd Test : యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ (138*; 206 బంతుల్లో, 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. ఓపెనర్ జాక్ క్రాలీ (76; 93 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్ (38; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. హ్యారీ బ్రూక్ (31) ఫర్వాలేదనిపించాడు.
మిగిలిన వారిలో నలుగురు బెన్ డకెట్, ఓలీపోప్, జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ డకౌట్లు అయ్యారు. బెన్‌స్టోక్స్ (19), విల్ జాక్స్ (19), గస్ అట్కిన్సన్ (4) లు విఫలం అయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టాడు. మైఖేల్ నేసర్, స్కాట్ బోల్యాండ్, బ్రెండన్ డగ్గెట్ తలా ఓ వికెట్ సాధించారు.
That’s the end of our first innings… with Joe Root unbeaten on 1️⃣3️⃣8️⃣*
Well batted, sir 🫡 pic.twitter.com/2ZwCRfXwzA
— England Cricket (@englandcricket) December 5, 2025
9 పరుగులు ఒక్క వికెట్..
ఓవర్ నైట్ స్కోరు 325/9 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 9 పరుగులు జోడించి మిగిలిన ఒక్క వికెట్ ను కోల్పోయింది. డాగెట్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ భారీ షాట్ కు యత్నించగా బౌండరీ లైన్ వద్ద మార్నస్ లబుషేన్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. జోరూట్, ఆర్చర్ జోడీ పదో వికెట్‌కు 70 పరుగులు జోడించడం విశేషం.
AN ABSOLUTE SCREAMER BY MARNUS LABUSCHAGNE. 🤯pic.twitter.com/DXjErsGxmi
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2025