AUS vs ENG : మెల్‌బోర్న్ మైదానంలో నగ్నంగా.. మాథ్యూ హేడెన్ పరువు కాపాడిన జోరూట్.. టవల్‌తో కాదు.. బ్యాట్‌తోనే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ను (AUS vs ENG)ఇంగ్లాండ్ కాస్త మెరుగ్గానే ఆరంభించింది.
AUS vs ENG 2nd Test Matthew Hayden says thanks to joe root
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ను ఇంగ్లాండ్ కాస్త మెరుగ్గానే ఆరంభించింది. ఈ పింక్ బాల్ (డే/నైట్) టెస్టు మ్యాచ్‌లో జో రూట్ (135 బ్యాటింగ్; 202 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకం బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోఫ్రా ఆర్చర్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (76; 93 బంతుల్లో 11 ఫోర్లు) అర్థశతకం బాదగా హ్యారీ బ్రూక్ (31) పర్వాలేదనిపించాడు. బెన్ స్టోక్స్ (19), విల్ జాక్స్ (19) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
హేడెన్ పరువు కాపాడిన జో రూట్..
ఆస్ట్రేలియా గడ్డ పై ఏ ఫార్మాట్‌లో చూసినా కూడా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా అతడి టెస్టు కెరీర్‌లో ఇది 40వ సెంచరీ.
గతంలో ఆస్ట్రేలియాలో నాలుగు యాషెస్ సిరీస్‌లు (AUS vs ENG ) ఆడినప్పటికి కూడా రూట్ ఒక్కసారి కూడా మూడు అంకెల స్కోరు సాధించలేకపోయాడు. ఈ క్రమంలో ఈ సిరీస్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
HE’S FINALLY DONE IT!
Joe Root has his first #Ashes century in Australia.
Live blog: https://t.co/2htO3lMX8d pic.twitter.com/9uZ26zQnPp
— cricket.com.au (@cricketcomau) December 4, 2025
భీకర ఫామ్‌లో ఉన్న జో రూట్ ఈ యాషెస్ సిరీస్‌లో సెంచరీ సాధిస్తాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతడు యాషెస్‌లో సెంచరీ చేయకుంటే మాత్రం తాను మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తానని తెలిపాడు. దీనిపై అప్పట్లోనే మాథ్యూ హేడెన్ కూతురు, కామెంటేటర్ గ్రేస్ హెడెన్ కూడా స్పందించింది. ఒక్క సెంచరీ అయినా చేయండి రూట్ అంటూ కోరింది.
Virat Kohli : కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేస్తే.. ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిందో తెలుసా?
ఇక యాషెస్ తొలి టెస్టులో విఫలమైన రూట్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం బాదాడు. దీంతో మాథ్యూ హేడెన్ సంబరాలు చేసుకున్నాడు. రూట్ కు ధన్యవాదాలు తెలియజేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మాథ్యూ హేడెన్ పరువు రూట్ కాపాడడని అంటున్నారు.
🤳 (1) 𝗜𝗻𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲@HaydosTweets has something he’d like to say to Joe Root 😅 pic.twitter.com/0yPGk7JC5S
— England Cricket (@englandcricket) December 4, 2025
