AUS W vs BAN W Australia Women qualify for ODI World Cup 2025 semi final
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో శోభన (66 నాటౌట్), రూబియా హైదర్ (44)లు రాణించారు. మిగిలినవారు ఘోరంగా విఫలం కావడంతో బంగ్లా తక్కువ పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్, జార్జియా వేర్‌హామ్ లు తలా రెండు వికెట్లు తీశారు. మేగాన్ షట్ ఓ వికెట్ పడగొట్టింది.
IND vs AUS : భారత్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
Alyssa Healy’s unbeaten ton and a clinical bowling effort takes Australia to the #CWC25 semis 🔥
As it happened in #AUSvBAN ➡️ https://t.co/g9A4UgJgAU pic.twitter.com/3hQ1shlWvN
— ICC (@ICC) October 16, 2025
అనంతరం 199 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ అలిస్సా హీలీ (113 నాటౌట్; 77 బంతుల్లో 20 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (84 నాటౌట్; 72 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించింది.
సెమీస్‌లో అడుగుపెట్టిన ఆసీస్..
ఇప్పటి వరకు ఆసీస్ 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గెలవగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆసీస్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. కాగా.. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో ఆసీస్ సెమీస్ బెర్తు ఖాయమైంది.
మరోవైపు బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌లు ఆడగా ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.